NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

1350 కోట్ల రూ. సానిటరీ కార్మికులను ఏర్పాటు చేయడం హర్షణీయం

1 min read

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1350 కోట్ల రూపాయలతో సానిటరీ కార్మికులను ఏర్పాటు చేయడం హర్షణీయం

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ హాస్టల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య అన్నారు. ఏలూరు నగరంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఈరోజు విలేకరుల సమావేశంలో బాలకోటయ్య మాట్లాడుతూ ఇటీవల చింతలపూడిలో జరిగిన బాలిక సంఘటనలో హాస్టల్ వార్డెన్ పై చర్య తీసుకున్నారని అన్నారు. సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1350 కోట్ల రూపాయలతో సానిటరీ కార్మికులను ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. దీనివల్ల హాస్టల్లో మెరుగైన వసతి సౌకర్యాలు ఏర్పడతాయన్నారు. ఇటీవల కొంతమంది దళిత క్రిస్టియన్ల పేరుతో మహాసభ ఏర్పాటు చేయడం అందులో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం అని అన్నారు. దళితుల పేరుతో మాట్లాడిన వ్యక్తులందరూ దళితులు కాదని వ్యాఖ్యానించారు. అంబేద్కర్ పేరుతో మాట్లాడే వారంతా అంబేద్కర్ వారసులు కాదని అన్నారు. దళిత క్రిస్టియన్ల కోసం దళితుల రైట్స్ కోసం ఎంతోకాలంగా మేము పోరాటం సాగిస్తున్నామని తెలిపారు. దళితుల సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే తీర్చాలి తప్ప ఎవరూ కూడా దీన్ని మార్పు చేయలేరని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దళితుల సంక్షేమ పట్ల ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఏలూరు నగరానికి విచ్చేసిన చైర్మన్ బాలకోటయ్యను ఏలూరు నగరానికి చెందిన పలువురు దళిత నాయకులు అలాగా రవికుమార్ పొలిమేర హరికృష్ణ లు ఘనంగా సన్మానించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *