తల్లి తండ్రిని కోల్పోయిన రామిశెట్టి శ్రీసాయి
1 min read
ఆపదలో ఆదుకున్న యమ్ యల్ ఏ
పెనమలూరు, న్యూస్ నేడు: మండలం గోసాల గ్రామానికి చెందిన రామిశెట్టి సాయి సరోజ, విట్ కాలేజీలో డిగ్రీ BBA 2వ సంవత్సరము చదువుతుండగా అకస్మాత్తుగా తల్లిదండ్రులను కోల్పోవడంతో, ఆమె విద్య మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది.ఈ విషయము ఎమెల్యే బోడే ప్రసాద్ దృష్టికి రాగానే, వారు వెంటనే స్పందించి, పెనమలూరు మండల తహసీల్దార్ మరియు బోడే దళం సభ్యుల సహకారంతో ₹1,85,000/- రూపాయలను డిమాండ్ డ్రాఫ్ట్‌ల రూపంలో ఆ విద్యార్థికి అందజేశారు. IAS అవ్వాలన్న తన కల మధ్యలోనే ఆగిపోకుండా, తనకు అండగా నిలిచిన శ్రీ బోడే ప్రసాద్ కి ఆ విద్యార్థి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ కార్యక్రమంలో మారుపూడి ధన కోటేశ్వరరావు కోయ ఆనంద ప్రసాద్ సంగీపు రంగారావు మాబు సుభాని ఎందువ రాంబాబు అబ్రహాము తదితరులు పాల్గొన్నారు.

