NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జనన – మరణ నమోదు వ్యవస్థను క్రమబద్ధీకరించాలి

1 min read

ప్రైవేట్ ఆసుపత్రుల డేటా సమయానికి వచ్చేలా దృష్టి సారించండి

ప్రభుత్వ ఆసుపత్రుల్లో శిశువు పేరు లేకుండా జనన సర్టిఫికేట్ జారీ

ఏడాది తర్వాత ధృవపత్రాలకు ఆర్డీఓ అనుమతి తప్పనిసరి

ప్రభుత్వ ఆసుపత్రి మరణాల నమోదు 7 రోజుల్లో పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

నంద్యాల,  న్యూస్​ నేడు: జిల్లాలో జనన, మరణ నమోదు వ్యవస్థను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్యాధికారులతో ఐడీసీసీ (IDCC)  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు జనన, మరణ వివరాలను సమయానికి మున్సిపాలిటీలు మరియు గ్రామపంచాయతీలకు అందజేసే విధంగా డేటా రిపోర్టింగ్‌ను క్రమబద్ధీకరించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో తల్లి డిశ్చార్జ్ సమయంలో శిశువు పేరు లేకుండానే జనన సర్టిఫికేట్ జారీ చేయాలని, అయితే ఒక సంవత్సరంలోపు శిశువు పేరును ఉచితంగా చేర్చే సదుపాయం కల్పించాలన్నారు.అవసరమైన సీఆర్‌ఎస్ ఫారమ్‌లు డీఎంహెచ్ఓ కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయని, వాటిని సేకరించుకోవాలని కలెక్టర్ వివరించారు.అలాగే ఆసుపత్రికి తీసుకువచ్చే ముందు మరణించిన కేసుల్లో, అంత్యక్రియలు జరిగే ప్రదేశంలోనే మరణ ధృవపత్రాలు జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ జూమ్ వీడియో కాన్ఫరెన్స్ లో డిఎంహెచ్ఓ, డా. వెంకటరమణ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

About Author