NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీశ్రీశ్రీ ఉరుకుంద ఈరన్న స్వామివారిని దర్శించుకున్న బుట్టా దంపతులు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  పవిత్ర శ్రావణమాసం సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బుట్టా రేణుక , బుట్టా ఫౌండేషన్ అధినేత శ్రీ బుట్టా శివ నీలకంఠ  శ్రీశ్రీశ్రీ ఉరుకుంద ఈరన్న స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు కర్నూలు పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో సుభిక్షంగా వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించారు. రైతులకు పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని, ప్రజలందరిపై స్వామివారి దివ్య కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని బుట్టా దంపతులు మనస్ఫూర్తిగా వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కె.ఆర్. రాంకోటేశ్వరరెడ్డి , ఎమ్మిగనూరు మండల యువజన విభాగ అధ్యక్షులు బనవాసి బసిరెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *