శుక్రవారం మద్రసా-ఎ-మొహమ్మదియా సల్ఫియా లిల్ బనాత్ సాలానా ఇజ్లాస్ నిర్వహణ
1 min read

హోళగుంద న్యూస్ నేడు : హోళగుంద మద్రసా-ఎ-మొహమ్మదియా సల్ఫియా లిల్ బనాత్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం సాలానా ఇజ్లాస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడనున్నది. ఈ కార్యక్రమం 24 ఏప్రిల్ 2026న మధ్యాహ్నం 3:00 గంటల నుండి రాత్రి 10:00 గంటల వరకు జరుగుతుంది.ఈ కార్యక్రమానికి ప్రముఖ ఉలమా మరియు పండితులు హాజరై ఆధ్యాత్మిక, విద్యా మరియు సామాజిక అంశాలపై ప్రసంగాలు చేయనున్నారు. ముఖ్యంగా ముస్తఫా అజ్మల్ మన్సూర్ మదాని ప్రత్యేక ప్రసంగం చేయనున్నారు. అదేవిధంగా బషీర్ అహ్మద్ జామియీ సభకు అధ్యక్షత వహించగా, అబ్దుస్ సలాం జామియీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.కార్యక్రమంలో విద్యార్థినుల ఇల్మీ ముజాహిరా (విద్యా ప్రదర్శన), మద్రసా వార్షిక నివేదిక సమర్పణ, సర్టిఫికెట్లు మరియు బహుమతుల పంపిణీ వంటి అంశాలు చోటు చేసుకోనున్నాయి.ఈ సందర్భంగా నిర్వహకులు మాట్లాడుతూ, ఈ నూరాని ఇజ్లాస్ కార్యక్రమానికి ప్రాంతీయ ప్రజలు, విద్యార్థులు మరియు అభిమానం కలిగిన వారు అందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
నిర్వాహకులు:మద్రసా-ఎ-మొహమ్మదియా సల్ఫియా లిల్ బనాత్, హోళగుంద సంప్రదించండి:+91 83748 94590+91 89789 86461+91 99010 01090.

