రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం సుస్థిర పాలన అందిస్తోంది
1 min read

ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి
39వ డివిజన్ లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : రాష్ట్ర ప్రజల శ్రేయస్సే ప్రధాన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం సుస్థిరపాలనకు నాంది పలికిందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఉద్ఘాటించారు. ప్రజా ఛైతన్యంతోనే మంచి పరిపాలనకు కొనసాగింపు మరింత సాధ్యమవుతోందని అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో అట్టహాసంగా కొనసాగుతోంది. దీనిలో భాగంగా నగరంలోని డివిజన్‌లలో విస్త్రృతంగా పర్యటిస్తూ వస్తోన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ, ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇదేక్రమంలో తాజాగా శుక్రవారం సాయంత్రం స్థానిక 39వ డివిజన్‌లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు మహిళలు పూలవర్షం కురిపిస్తూ అపూర్వ స్వాగతం పలికారు. ఇంటింటికీ వెళ్ళి ప్రజా సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాల అమలు తీరుపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వేచ్ఛాయుత వాతావరణం కల్పిస్తూ, సుపరిపాలనను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా గడిచిన ఏడాదికాలంలో ప్రజాశ్రేయస్సే ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాల లబ్దిని అర్హులకు కల్పించిన ఘనతను ప్రభుత్వం సొంతం చేసుకుందన్నారు. ఇదేక్రమంలో ప్రజలంతా ప్రభుత్వ పాలనపై పూర్తిస్థాయిలో అవగాహనను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందనీ ఆయన అభిప్రాయపడ్డారు. అప్పుడే మంచిని మరింత పెంచేందుకు అస్కారం పెరుగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఈడా ఛైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఏలూరు ఎఎంసి ఛైర్మన్ మామిళ్ళపల్లి పార్ధసారధి, డిప్యూటి మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు, ఏలూరు నగర టిడిపి అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కో-ఆప్షన్ సభ్యులు ఎస్సెమ్మార్ పెదబాబు, మాజీ కౌన్సిలర్ బెల్లపుకొండ కిషోర్, పలివెల లవకిషోర్ మరియు డివిజన్ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


