NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రగతి పనులను వేగవంతం పూర్తి చేయాలి

1 min read

పాణ్యం నియోజకవర్గ శాసనసభ్యురాలు గౌరు చరితరెడ్డి

రూ.2.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన 

కల్లూరు, న్యూస్​ నేడు: శుక్రవారం నగరంలో ప్రగతి పనులను వేగవంతం చేయాలని, నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని పాణ్యం నియోజకవర్గ శాసనసభ్యురాలు గౌరు చరితరెడ్డి అన్నారు. శుక్రవారం కల్లూరు అర్బన్ పరిధిలో 6 వార్డుల్లో రూ.2.30 కోట్ల విలువ గల అభివృద్ధి పనులకు కమిషనర్ పి.విశ్వనాథ్‌తో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.ఎన్‌క్యాప్ నిధులతో 32, 35వ వార్డుల పరిధిలో చెన్నమ్మ సర్కిల్ నుండి ఏపిఐఐసి కార్యాలయం వరకు రూ.90 లక్షలతో రహదారి విస్తరణ, 36వ వార్డు వై‌.జంక్షన్ నుండి పెద్దపాడు వరకు రూ.25 లక్షలతో డివైడర్లలో పచ్చదనం పెంపు పనులకు, అలాగే సాధారణ నిధులతో 30వ వార్డులో సుంకులమ్మ ఆలయం నుండి హంద్రీ నది వరకు రూ.49.95 లక్షలతో డిస్పోజబుల్ డ్రైన్, 37వ వార్డు శరీన్ నగర్ నందు రూ.50 లక్షలతో సిసి డ్రైన్, 41వ వార్డు సిద్దార్థ హోమ్ నందు రూ.15 లక్షలతో సిసి డ్రైన్ నిర్మాణానికి ఎమ్మెల్యే, కమిషనర్ శంకుస్థాపనలు చేశారు.కార్యక్రమంలో కార్పొరేటర్ జయరాముడు, ఎంఈ లీల ప్రసాద్, డిఈఈ క్రిష్ణలత, ఏఈ భాను ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.

About Author