ఘనంగా 8వ రాష్ట్రీయ పోషణ మాసొత్సవం
1 min read

అంగన్వాడీల ఆధ్వర్యంలో… హొళగుందలో నిర్వహణ
ఎంపీడీవో విజయలలిత… సూపర్వైజర్ షీభారాణి ఆధ్వర్యంలో
గర్భవతులకు శ్రీమంతం… చిన్నారులకు అన్నప్రాసన… పౌష్టికాహార తయారీపై అవగాహన
హొళగుంద న్యూస్ నేడు: కేంద్ర… రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం అమలు చేస్తున్న పోషణ్ అభయాన్ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీల ద్వారా పోషకాహారం, పోషణ పై పౌష్టికాహార మాసోత్సవ కార్యక్రమాన్ని హొళగుంద లో అంగన్వాడి విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ నెల 16వ తేదీ వరకు నెల రోజులపాటు పోషణ, ఆహార పద్ధతులు, బలవర్ధకమైన ఆహారం, స్థానికానికి మద్దతు , సమగ్ర పోషణకు డిజిటలికరణ ద్వారా మద్దతు వంటి కార్యక్రమాలను వివరిస్తూ ఎనిమిదవ రాష్ట్రీయ పోషణ మాసోత్సవాన్ని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థూలకాయ నివారణకు నూనెల వినియోగం తగ్గింపు, బాల్య దశ సంరక్షణ మరియు విద్య కొరకై పోషన్ కూడా చదువు కూడా అంటూ నినాదం, శిశు మరియు చిన్న పిల్లల ఆహారపు అలవాట్లు (ఐవైసీఎఫ్ ), గ్రామీణ శక్తికి మార్గం పోషణకు బలమైన పునాది స్థానికానికి మద్దతు, డిజిటలైజేషన్ కోసం స్వరం తో సమన్వయ చర్యలు మరియు డిజిటలీకరణ ద్వారా సమగ్ర పోషణకు బలమైన అడుగు అంటూ కార్యక్రమానికి హాజరైన అంగన్వాడి కార్యకర్తలు గర్భవతులు బాలింతలు లకు వివరించారు. ఈ కార్యక్రమంలో చిరుధాన్యాలలో ఉన్న పోషకాలను గురించి వివరించి, చిరుధాన్యాలతో వంటలను తయారు చేసుకోవడంపై అవగాహన కల్పించారు. ఎంపీడీవో విజయ లలిత అంగన్వాడి సూపర్వైజర్లు షీభారాణి… పద్మావతి… సౌభాగ్య… ఈరమ్మ మాట్లాడుతూ పౌష్టికాహారం యొక్క ప్రయోజనాలను తెలియజేశారు. గర్భవతులు… బాలింతలు ప్రభుత్వం అంగన్వాడీల ద్వారా అందించే పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా వారిలో రక్తహీనత తగ్గి ఆరోగ్యంగా ఉండడంతోపాటు గర్భంలో ఉన్న శిశువుకు… అనంతరం చిన్నపిల్లలకు పోషకాల సక్రమంగా అంతాయని తెలియజేశారు. పోషకాహారం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఎదిగి బలమైన ఆరోగ్యవంతమైన సమాజంలో భాగస్వాములు అవుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన బాలింతలకు ఎంపీడీవో విజయా లలిత… అంగన్వాడి సూపర్వైజర్లు షిభారాణి పద్మావతి సౌభాగ్య ఈరమ్మ లు శ్రీమంతాలను నిర్వహించారు. అదేవిధంగా చిన్నపిల్లలకు అన్నప్రాసన జరిపించి ఆశీర్వదించారు. పౌష్టికాహారం తయారు చేసుకోవడం పౌష్టికాహారాన్ని తీసుకోవడంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గర్భిణీ మహిళలు, బాలింతలు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.


