ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: సమాజ భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి ఉద్దేశించిన కేంద్ర విద్యా శాఖచే నిర్వహించబడుతున్న విద్యాంజలి వాలంటరీ ప్రోగ్రాంకు సంబంధించి ఒకరోజు అవగాహన కార్యక్రమంలో గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి మరియు సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ లోకరాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడమైనది ఈ కార్యక్రమంలో ప్రతి మండలం నుండి మండల విద్యాశాఖ అధికారులు క్లస్టర్ ప్రధాన ఉపాధ్యాయుడు, రిసోర్స్ పర్సన్స్ ,స్వచ్ఛంద సంస్థl ప్రతినిధులు, స్కూల్ మేనేజ్మెంట్ సభ్యులు సమగ్ర శిక్ష సెక్టోరల్ అధికారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ విద్యాంజలి కార్యక్రమం పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకొని సమాజంలో దాతలు పూర్వ విద్యార్థులు స్వచ్ఛంద సంస్థల సహకారంతో విద్యాంజలి పోర్టల్ ద్వారాప్రభుత్వ పాఠ శాలల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే లక్ష్యంతో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన విద్యాంజలి కార్యక్రమంలో పాలుపంచుకోవాలని చెప్పడం జరిగింది .ఈ శిక్షణా కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ లు విద్యంజలి కార్యక్రమం పై అవగాహన కల్పించడం జరిగింది.విద్యాంజలి వెబ్సైట్లో పాఠశాలలకు అవసరమైన వందకు పైగా సేవలను ప్రధానోపాధ్యాయులు నమోదు చేస్తే కంపెనీలు, స్వచ్చంద సంస్థలు, దాతలు ముందుకు వచ్చి పాఠశాలల అవసరాలను తీర్చే అవ కాశం ఉందన్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాల విద్యాంజలి పోర్టల్లో తమ అవసరాలను క్రమం తప్పకుండా నమోదు చేయడం అలవాటుగా మార్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష సెక్టోరల్ అధికారులు, మండల విద్యాధికారులు, రిసోర్సుపర్పన్లు, స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు, ఎన్ జి ఓలు, ఎస్ ఎం సి చైర్మన్ లు పాల్గొన్నారు.

