ఏలూరు కార్పొరేషన్ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ చలివేంద్రాన్నిఏర్పాటు
1 min read

ప్రజలకు స్వయంగా మజ్జిగ పంపిణీ
ఎమ్మెల్యే చంటి,నగర మేయర్ షేక్ నూర్జహాన్
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు:స్ఫూర్తిదాయకమైన సేవలకు హేలాపురి ప్రజలు ఆదర్శవంతమైన అడుగులు వేయాలని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చారు. వేసవి తీవ్రత పెరిగిన నేపథ్యంలో పాదచారులు, వాహనదారుల సౌకర్యార్థం ఏలూరు కార్పొరేషన్ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబుతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ప్రజలకు స్వయంగా మజ్జిగను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ తానిచ్చిన పిలుపును అందుకున్న ప్రతిఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ఎంతో ఆదర్శనీయమని ప్రశంసించారు. ఎండలు మండుతోన్న తరుణంలో మరింత మంది దాతలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలంతా సమిష్టిగా పాటుపడాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి సూచించారు. నగర మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ ఎండల తీవ్రత పెరుగుతున్న క్రమంలో అందుకు తగ్గట్టుగానే చలివేంద్రాల సంఖ్య కూడా పెరగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి, డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాసరావు,కార్పొరేషన్ కమిషనర్ ఎభానుప్రతాప్, అదనపు కమిషనర్ డి. శ్రీనివాసరావు,టిడిపి నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కో-ఆప్షన్ సభ్యులు ఎస్సెమ్మార్ పెదబాబు, క్లస్టర్ ఇంచార్జ్ మారం అను,డివిజన్ ఇంచార్జ్ బచ్చు మురళి,డివిజన్ ప్రెసిడెంట్ మోహన్ బోస్లే తదితరులు పాల్గొన్నారు.

