నాణ్యమైన లిక్కర్ అమ్మకాలు లక్ష్యం
1 min read

ఏ.పి ఎక్సైజ్ మరియు ప్రొహిబిస్ శాఖ డైరెక్టర్ శ్రీధర్ చామకూరి ఐ.ఎ.ఎస్
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ మరియు ప్రొహిబిస్ శాఖ డైరెక్టర్ శ్రీధర్ చామకూరి,ఐ.ఎ.ఎస్ ఏలూరు విచ్చేసి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రొహిబిస్ మరియు ఎక్సైజ్ శాఖ అధికారులు మరియు క్షేత్ర స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం ఏలూరు కల్లెక్టరేట్ లోని గోదావరి హాల్ నందు గురువారం నిర్వహించినారు. ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీధర్ చామకూరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రొహిబిస్ మరియు ఎక్సైజ్ శాఖ అధికారులు మరియు క్షేత్ర స్థాయి అధికారులకు క్రింది విధంగా తగు ఆదేశాలను జారిచేశారు.ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా లోని అన్ని లిక్కర్ ఔట్లెట్ల లో ప్రతి లిక్కర్ బాటిల్ విధిగా ఏ.పి సురక్షా యాప్ ద్వారా స్కాన్ చేసి మాత్రమే అమ్మకాలు జరపాలని, అందుకు క్షేత్ర స్థాయి అధికారుల నిరంతరం మానిటరింగ్ చేస్తూ షాపుల వాళ్ళకి తగు ఆదేశాలను జారీ చెయ్యలని అదేశించారు. అదేవిధంగా ప్రజలకు నాణ్యమైన లిక్కర్ అందుబాటులో ఉండాలనె ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్ష మేరకు ప్రతి లిక్కర్ ఔట్లెట్ల నుంచి ప్రముఖ టాప్ 10 లిక్కర్ బ్రాండ్ల యొక్క శాంపిల్ లను విధిగా తీసి వాటిని రీజినల్ ఎక్సైజ్ ల్యాబ్ కు పంపి లిక్కర్ క్వాలిటీ ని చెక్ చెయ్యలని సూచనలతో అదేశించరు.అదేవిధంగా నాటుసారా, ఎన్.డి.పి.ఎల్ లిక్కర్, స్పురియస్,కల్తీ కల్లు మొదలగు నేరములు జరగ కుండా క్షేత్ర స్థాయిలో ని అధికారులు గట్టి నిఘా ఏర్పాటు చేసి వాటిని పూర్తిగా అరికట్టాలని అన్నారు.అదేవిధంగా క్షేత్ర స్థాయి లో ఉన్న ఇబ్బందుల గురించి అడగగా డిప్యూటీ కమీషనర్ ఏలూరు వారు బార్ల పై ఉన్న అధిక అపరాధ రుసుములు గురించి తెలుపగా,వాటిని పునఃసమీక్ష నిర్వహించి తగు ఆదేశాలు జరిచేస్తామని తెలిపినారు.అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రొహిబిస్ మరియు ఎక్సైజ్ శాఖ అధికారులు మరియు క్షేత్ర స్థాయి అధికారులు అందరూ చక్కగా తమ యొక్క విధులను సక్రమంగా నిర్వహిస్తూ ప్రొహిబిస్ మరియు ఎక్సైజ్ శాఖ కు మంచి పేరు సాదించాలని తగు సూచనలను జారీ చేసినారు.ఈ సమావేశానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రొహిబిస్ మరియు ఎక్సైజ్ శాఖ అధికారులు డిప్యూటీ కమీషనర్ ఏలూరు బి.శ్రీలత, అసిస్టెంట్ కమీషనర్,ఎన్ఫోర్స్మెంట్, ఏలూరు ప్రభుకుమార్, ఏలూరు మరియు పశ్చిమ గోదావరి జిల్లా ప్రొహిబిస్ అండ్ ఎక్సైజ్ అధికారులు ఏ.అవులయ్య మరియు బి.సుబ్బారావు మరియూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సుపేరిన్దేంట్ లు, (13) స్టేషన్ హౌస్ ఆఫీసర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


