NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మహిళా శక్తితోనే ప్రగతికి బాట

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  జి. పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలలో  మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ వై. రఘు నందిని రెడ్డి, న్యూరో ఫిజీషియన్, మెడికవర్ హాస్పిటల్, కర్నూల్ విచ్చేశారు. గౌరవ అతిథిగా రవీంద్ర విద్యాసంస్థల అకాడమిక్ అడ్వైజర్ డాక్టర్ మమతా మోహన్  విచ్చేశారు.గౌరవ అతిధి, రవీంద్ర విద్యాసంస్థల అకాడమిక్ అడ్వైజర్ డాక్టర్ మమతా మోహన్  మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం  ప్రపంచవ్యాప్తంగా మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ విజయాలను గుర్తిస్తూ, మహిళా సాధికారతను ప్రోత్సహించేందుకు ఈ వేడుకలు నిర్వహిస్తారని. ఈ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ‘Give to Gain’ (ఇవ్వడం ద్వారా పొందడం) అనే నినాదంతో ముందుకు సాగుతోంది అని తెలియజేశారు. “యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః” అంటే ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో, అక్కడ దేవతలు కొలువై ఉంటారు (సంతోషిస్తారు) అని అర్థం అని కొటేషన్ ని విద్యార్థినీలకు గుర్తు చేశారు. కుటుంబానికి వెలుగుగా, సమాజానికి స్ఫూర్తిగా ఉన్న ప్రతి మహిళకూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి. శ్రీనివాసరావు మరియు మహిళ అధ్యాపకులు విద్యార్థినీలు పాల్గొన్నారు.  ఈ కార్యక్రమం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫౌజియా బేగం అధ్యక్షతన నిర్వహించబడినది.

About Author