NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మహిళలు చైతన్యవంతులు కావాలి

1 min read

జూనియర్ సివిల్ జడ్జి దివ్య..

న్యూస్ నేడు నందికొట్కూరు: నేటి సమాజంలో మహిళలు చైతన్యవంతులు కావాలని నందికొట్కూరు జూనియర్ సివిల్ జడ్జి దివ్య అన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో కోర్టు ఆవరణంలో శనివారంఅంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మండల న్యాయ సేవా సంఘం ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది.మండల న్యాయ సేవా సంఘం చైర్మన్ మరియు సీనియర్ సివిల్ జడ్జి శోభారాణి మరియు జూనియర్ సివిల్ జడ్జి పాల్గొన్నారు.ఈ సందర్భంగా జడ్జి ఏ శోభారాణి మాట్లాడుతూ మహిళా హక్కుల కోసం,సమానత్వం మరియు విముక్తి కోసం అనేక ఉద్యమాలు చేసిన మహిళా మూర్తులను స్మరించుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు.స్త్రీ శక్తిని వారి త్యాగాలను సాధించిన విజయాలను గౌరవిస్తూ స్ఫూర్తినిచ్చే రోజు అన్నారు.   మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.తర్వాత జూనియర్ సివిల్ జడ్జి వి.దివ్య మాట్లాడుతూ లింగ సమానత్వం మహిళలపై హింస మరియు దుర్వినియోగం వంటి సమస్యలపై ఎంతోమంది పోరాటం చేశారన్నారు. ఇప్పటికే మహిళల్లో ఎంతో అభివృద్ధి చైతన్యం కలిగి ఉన్నారని మహిళా దినోత్సవం జరుపుకోవడం ఎంతో గర్వంగా ఉందన్నారు. మహిళా సాధికారతే లక్ష్యంగా చేసిన ఎందరో మహిళలకు కృతజ్ఞతలు అన్నారు.ఈ కార్యక్రమంలో లోక్ అదాలత్ నామినేటెడ్ మెంబర్ డి శోభారాణి,ఐసిడిఎస్ సిబ్బంది,సన్మార్గ సేవా సంస్థ సంఘ ప్రతినిధులు మరియు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం సన్మార్గ్ సేవా సంస్థ సోషల్ వర్కర్లు ప్రమీలమ్మ మరియు మల్లేశ్వరి లకు జడ్జి శోభారాణి శాలువాతో  సన్మానించారు.

About Author