NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కార్పొరేషన్‌ ఎన్నికల్లో కూటమి అభ్యర్ధులకు ప్రజలంతా మద్దతుగా నిలవాలి

1 min read

జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు,ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి

46వ డివిజన్‌ కూటమి టీడీపీ కార్పొరేటర్‌ అభ్యర్ధి బ్రమర లక్ష్మి, 41వ డివిజన్‌ కార్పొరేటర్‌ అభ్యర్ధి వడమోదుల సంధ్య శ్రీలక్ష్మి అత్యధిక మెజార్టీతో గెలిపించండి

చింతచెట్టు రోడ్డులో ఉమ్మడి ప్రజా సమావేశంలో

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ప్రజా నిర్ణయమే శిరోధార్యంగా, జనరంజక పాలన అందించడమే ధ్యేయంగా ప్రణాళికాయుతంగా ముందుకెళ్తున్నామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఈ దశలో కార్పొరేషన్‌ ఎన్నికల్లో కూటమి అభ్యర్ధులకు ప్రజలంతా మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికల్లో కూటమి అభ్యర్ధుల ప్రచారం ఉవ్వెత్తున ఎగసిన కెరటంలా దూసుకెళ్తోంది. అభ్యర్ధుల పక్షాన టీడీపీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి విస్త్రృత ప్రచారం నిర్వహిస్తూ వస్తున్నారు. వారి గెలుపు కోసం సర్వశక్తులొడ్డుతూ వస్తున్నారు. ఇదేక్రమంలో స్థానిక ఆర్‌ఆర్‌ పేటలోని చింతచెట్టు రోడ్డులో నిర్వహించిన ఉమ్మడి ప్రజా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే బడేటి చంటి కూటమి అభ్యర్ధులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు మీరావలీ, 46వ డివిజన్‌ కూటమి టీడీపీ కార్పొరేటర్‌ అభ్యర్ధి బ్రమర లక్ష్మి, 41వ డివిజన్‌ కార్పొరేటర్‌ అభ్యర్ధి వడమోదుల సంధ్య శ్రీలక్ష్మి, నాయకులు చల్లా విజయ్‌ కుమార్‌, ఈదుపల్లి రంగారావు, విక్రమ్‌, పిల్లారిశెట్టి సురేష్‌, మజ్జి కాంతారావు, మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *