మేము అధికారంలోకి రాగానే రఫ్ఫా రఫ్ఫా
1 min read

మా కార్యకర్తలను ఇబ్బంది పెడితే ఎవరనీ వదలం
కార్యకర్తల సహాయ సహకారాలతో 5 వ సారి ఎమ్మెల్యే గా గెలుస్తా
మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి
మంత్రాలయం న్యూస్ నేడు : మేము అధికారంలోకి రాగానే మా కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నా వారిని రఫ్ఫా రఫ్ఫా ఆడిస్తామని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి హెచ్చరించారు. మంగళవారం నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వైకాపా మండలాధ్యుక్షులు భీంరెడ్డి , కన్వీనర్ విశ్వనాథ్ రెడ్డి , సర్పంచ్ భీమయ్య అధ్వర్యంలో కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజ్ లను ప్రైవేటీకరణ నిరసిస్తూ కోటి సంతకాలు సేకరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవారికి ఉచితంగా మెరుగైన వైద్యం , పేద విద్యార్థులకు ఉచితంగా వైద్య విద్య ను అభ్యసించాలనే లక్ష్యంతో రెండేళ్లలో 17 మెడికల్ కాలేజ్ ను జగన్మోహన్ రెడ్డి నిర్మించారన్నారు. అనంతరంమెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణ ను నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ భాగంగా తన వంతు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు దశరథ రెడ్డి , అడ్వకేట్ గురుస్వామి, జనార్దన్ రెడ్డి , బొంబాయి శివ , వెంకటేష్ శెట్టి , సూగురు గోపిస్వామి , వైస్ ఎంపిపి పులకుక్క రాఘవేంద్ర , ఉప సర్పంచ్ హోటల్ పరమేష్ , వార్డ నెంబర్ వీరారెడ్డి , మధుసూదన్ రెడ్డి ,బూదూరు , జక్కయ్య ,మండల వైసీపీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

