విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం
1 min read

తరతరాలకు ఉపాధ్యాయులను గౌరవించే సంప్రదాయం వర్ధిల్లాలి
విద్యా బోధనలో ఉన్న తృప్తి మరే ఉద్యోగం లో లేదు
రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి కృషి చేస్తోంది
జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా
కర్నూలు, న్యూస్ నేడు: విద్యార్థుల భవిష్యత్తును తీర్చిద్దడం ద్వారా సమాజాభివృద్ధి లో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా పేర్కొన్నారు.శుక్రవారం కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురు పూజోత్సవం-2025 కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యే, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అధ్యాపకునిగా జీవితాన్ని ప్రారంభించి, భారత రాష్ట్రపతిగా సేవలు అందించి, భారతరత్నగా కీర్తింపబడిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా ఉపాధ్యాయులను గౌరవించుకోవాలన్న ఉద్దేశంతో 1962 నుండి సెప్టెంబర్ 5 వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. తల్లి, తండ్రి తర్వాత గురువును పూజించే సంప్రదాయం అనాదిగా వస్తోందని, ఈ సంప్రదాయం తరతరాలకు వర్ధిల్లాలని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. జీవితకాలంలో రోజుకు సుమారు 8 గంటలు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాఠశాలలు, కళాశాలల్లో గడపడంవల్ల ఒక ప్రత్యేక అనుబంధం ఏర్పడుతుందని, ఇది ఇలాగే కొనసాగాలని కలెక్టర్ తెలిపారు.. విద్య మాత్రమే కాకుండా విలువలు, సమాజంలో ఎలా నడుచుకోవాలని నేర్పించడంలో ఉపాధ్యాయుల పాత్ర అపారమని కలెక్టర్ పేర్కొన్నారు..రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. పేదలందరికీ మంచి విద్యను అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలు చేస్తోందన్నారు.. బడి ఈడు పిల్లలందరినీ బడిలోనే చేర్పించాలనే అంశంలో కర్నూలు జిల్లా రాష్ట్రంలోనే ముందుందన్నారు.. గత సంవత్సరం 5.15 లక్షల మంది విద్యార్థులు బడిలో ఉండగా, ఈ ఏడాది 5.22 లక్షల మంది విద్యార్థులు బడిలో ఉన్నారని తెలిపారు.. ఒకటవ తరగతిలో 7200 మంది విద్యార్థులు కొత్తగా ఎవిద్యను ఎవరూ దొంగిలించలేరని, విద్యను అశ్రద్ద చేయవద్దని ఎమ్మెల్యే విద్యార్థులకు సూచించారు.కార్యక్రమం లో అధ్యాపకులు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు,తదితరులు పాల్గొన్నారు.


