NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ రెండవ సమావేశం ఏర్పాటు చేయాలి

1 min read

ఏపి మీడియా ఫెడరేషన్ (ఏపీఎమ్ఎఫ్) యూనియన్ నాయకులు జిల్లా కలక్టర్ కు వినతి

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ రెండవ సమావేశం ఏర్పాటు చేయాలని  ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ (ఏ పీ ఎమ్ ఎఫ్ ) యూనియన్ నాయకులు సోమవారం జిల్లా కలెక్టర్ వెట్రీ   సెల్వి ను కలిశారు.జిల్లాలో మీడియా అక్రిడిటేషన్ కమిటీ తొలి సమావేశం జరిగి నాలుగు నెలలు దాటింది అని,ఇంకా చాలా మంది అర్హత కలిగిన పాత్రికేయులు అక్రెడిటేషన్ కోసం దరఖాస్తు చేసుకుని ఉన్నారనీ,రెండవ విడత సమావేశం ఏర్పాటు చేసి వారందరికి అక్రెడిటేషన్లు మంజూరు చెయ్యాలని కోరారు.దీనికి కలెక్టర్ వెంటనే స్పందించి ఈ నెల 18 వ తేదీన జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని, సమాచార శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా  జర్నలిస్టుల సంక్షేమం కోసం  కృషి చేస్తున్న జిల్లా కలెక్టర్ కు యూనియన్ నాయకులు, దుద్దే. ఉదయ భాస్కర్,(స్టేట్ మీడియాఅక్రెడిటేషన్ కమిటీ మెంబర్). వేమూరి విద్యాసాగర్, సోడిశెట్టి శాంత కుమార్  (జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీ సభ్యులు)కోయ శ్యాం ప్రసాద్, ఆకుల క్రాంతి నాథ్,లక్ష్మయ్య,    రామకృష్ణ , ప్రేమ్ కుమార్, శ్రీనివాస్,పలువురు మీడియా ప్రతినిధులు కృతజ్ఞతలు  తెలిపారు.

About Author