NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

1 min read

– తెలుగుదేశం పార్టీ నాయకుల పిలుపు

హోళగుందన్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి  వైకుంఠం జ్యోతి ఆదేశాల మేరకు, హొళగుంద మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య ఆధ్వర్యంలో హొళగుంద మండలంలోని 45వ బూత్ పరిధిలో ఇంటింటి ఓటరు జాబితా సవరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో 45వ బూత్ కన్వీనర్ హనుమంతు, సచివాలయ సిబ్బంది శివశంకర్ నాయక్తో కలిసి ఇంటింటికి వెళ్లి ఓటరు జాబితా సవరణలపై ప్రజలకు అవగాహన కల్పించారు. క్లస్టర్ పరిధిలోని సిబ్బందికి, బూత్ స్థాయి ప్రతినిధులకు కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించి, ప్రతి అర్హుడైన పౌరుడు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.శ్రీరామ్‌నగర్ క్యాంపు పరిధిలో గడప గడపకు వెళ్లి 18 సంవత్సరాలు నిండిన యువతను గుర్తించి, కొత్త ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవసరమైన ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఫోటో తదితర పత్రాలను సేకరించి సంబంధిత అధికారులకు అందజేయాలని తెలియజేశారు.అలాగే పాత ఓటరు జాబితాను కొత్త జాబితాతో పోల్చి పరిశీలించడం, పేర్లు తప్పిపోయిన వారు, మార్పులు అవసరమైన వారు, కొత్తగా అర్హత పొందిన వారిని గుర్తించి నమోదు చేయడం వంటి అంశాలపై ప్రజలకు వివరంగా అవగాహన కల్పించారు. ప్రతి ఓటరును జాగ్రత్తగా పరిశీలిస్తూ ఓటరు జాబితా పారదర్శకంగా ఉండేలా చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడైన పౌరుడు తప్పనిసరిగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో 45వ బూత్ కన్వీనర్ హనుమంతు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జంబాపూర్ వీరేష్, సిద్ధప్ప, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *