పోలీసు అమరవీరుల కు ఘనంగా నివాళులు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: రాష్ట్ర పరిశ్రమలు,వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ , జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ కబర్థి , జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ , జాయింట్ కలెక్టర్ నూరల్ కమర్ ఐఏయస్, విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం . దేశ, రాష్ట్ర శాంతి భద్రతల పరిరక్షణలో (01.09.2024 నుండి 31.08.2025) ప్రాణ త్యాగాలు చేసి అమరులైన 191 మంది పోలీసులకు ఘన నివాళి .విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీసు అమరవీరులను స్మరించుకోవడం మన భాద్యత , వారు చేసిన త్యాగాలు, సేవలు మరువలేనివని రాష్ట్ర పరిశ్రమలు,వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ , జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీ కబర్థి , జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ , జాయింట్ కలెక్టర్ నూరల్ కమర్ ఐఏయస్లు అన్నారు.పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సంధర్బంగా మంగళవారం స్ధానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని పెరేడ్ మైదానంలో అమరవీరుల స్ధూపం వద్ద స్మృతి పెరేడ్ నిర్వహించారు.రాష్ట్ర పరిశ్రమలు,వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి , జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా ఎస్పీ, జాయింట్ కలెక్టర్ స్మృతి పరేడ్ కు హజరై, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.రాష్ట్ర పరిశ్రమలు,వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ… దేశ వ్యాప్తంగా విధినిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరిస్తూ, ప్రతి ఏడాది అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటించడం జరుగుతుందన్నారన్నారు. 01.09.2024 నుండి 31.08.2025 నాటికి భారత దేశ వ్యాప్తంగా 191 మంది పోలీసులు వీరమరణం పొందారన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభధ్రతల పరిరక్షణలో ఈ సంవత్సరం 5 మంది ప్రాణ త్యాగాలు చేశారన్నారు. విధి నిర్వహణలో ఎంతో మంది పోలీసులు కుటుంబాలకు దూరంగా ఉంటూ వారు చేసే ప్రాణా త్యాగాలు మన గుండెల్లో నిలిచిపోతాయన్నారు.


