NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూలు జీజీహెచ్​కు ట్రాలీలు .. వీల్ చైర్ విరాళం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో కీ.శే. రాజ వర్ధన్ రెడ్డి 47వ జయంతి సందర్భంగా కోడుమూరు శాసనసభ సభ్యులు  బొగ్గుల దస్తగిరి  విష్ణు సేన వారి ఆధ్వర్యంలో ఆసుపత్రికి నాలుగు ట్రాలీలు మరియు ఒక వీల్ చైర్‌ను విరాళంగా అందజేశారు. అలాగే పేద రోగులకు బెడ్షీట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ కే. వెంకటేశ్వర్లు  మాట్లాడుతూ — సామాజిక సేవలో భాగంగా వైద్య సేవలకు తోడ్పడుతున్న విష్ణు సేన సిబ్బందికి మరియు కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి కి ఆసుపత్రి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అని అన్నారు.కార్యక్రమంలో ఆసుపత్రి ఇన్‌చార్జ్ సీఎస్ఆర్ఎంఓ డాక్టర్ వెంకటరమణ, హాస్పిటల్ హెచ్‌డీఎస్ కమిటీ సభ్యులు రామాంజనేయులు, టిడిపి కార్యకర్తలు, మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

About Author