వేదావతి నదిపై బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుడుతాం
1 min read

కర్ణాటక రాష్ట్రం బళ్ళారి ఎంపీ తుకారం హామీ
గూళ్యం గ్రామంలో గాది లింగేశ్వరస్వామి వారికి ప్రత్యేక పూజలు చేసిన కురువ శశికళ కృష్ణమోహన్ దంపతులు
ఆలూరు న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గం హాలహర్వి మండలంలోని బసరకోడు మరియు గూళ్యం గ్రామాల సరిహద్దులో ఉన్న వేదావతి నది (హగరి) మీదుగా కర్ణాటక ఆంధ్ర ప్రాంతాలకు రాకపోకలకు ఇబ్బందిగా ఉండడంతో వాహనదారులు మరియు రైతులు, ప్రజలు ప్రతి ఏడాది కూడా రాళ్లు గరుసుతో చందాలు సేకరించుకొని తాత్కాలిక రోడ్డును నిర్మించుకుంటున్న విషయం కర్ణాటక రాష్ట్రం బళ్లారి ఎంపీ తుకారాంకు తెలియజేశారు గూళ్యం గ్రామంలో పర్యటించిన అనంతరం వేదావతి నదిపై (సేతువు) బ్రిడ్జి నిర్మాణానికి తన వంతు బాధ్యతగా కర్ణాటక సీఎం దృష్టికి తీసుకెళ్లి బ్రిడ్జి నిర్మాణానికి కావాల్సిన నిధులు అంచనా వేయించి త్వరలోనే బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుడతామని ప్రజలకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కంప్లీ నియోజకవర్గం శాసనసభ్యులు గణేష్ గారు, సంండూరు ఎమ్మెల్యే అన్నపూర్ణ , వైఎస్ఆర్సిపి రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి శశికళ కృష్ణమోహన్ దంపతులు, బళ్లారి మేయర్, గూళ్యం మాజీ సర్పంచ్ రాజశేఖర్ గౌడ్ మరియు కురువ సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


