ప్రతిసారి రెండు చుక్కలు – పోలియోపై నిరంతర విజయం
1 min read

ఆలూరు న్యూస్ నేడు: “స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్” మరియు “ప్రతిసారి రెండు చుక్కలు – పోలియోపైనిరంతర విజయం” అనే నినాదంతో ఆలూరు పట్టణంలోని ఎం.ఈ.ఓ కార్యాలయం వద్ద ఉన్న పాఠశాలలో పోలియో నివారణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలూరు టీడీపీ ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి హాజరయ్యారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేసి, పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.


