NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పరిసరాలను  పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని ఎంపీడీవో శ్రీనివాస్ రావు, ముస్లిం మైనార్టీ నాయకులు ఖాజా పీర్ అన్నారు. ఈ సందర్భంగా ప్రతి నెలలో మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ ప్రదేశ్ కార్యక్రమను ఈవో శివకుమార్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం స్థానిక మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉద్యోగులతో సమీక్షించి, స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ ప్రదేశ్ అందులో భాగంగా ర్యాలీని ప్రధాన రహదారిపై నిర్వహించి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న రహదారిపై ప్రతిజ్ఞ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వచ్ఛ ఆంధ్ర ,స్వచ్ఛ ప్రదేశ్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకమును నియోజకవర్గ శాసనసభ సభ్యులు కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి ఆదేశం మేరకు లో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ ప్రదేశ్ నిర్వహిస్తూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వారు వారి కోరుతూ పంచాయతీ కార్మికులతో రోడ్లను సుప్రపరిచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో, పి ఆర్ ఏ ఈ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ టి. శ్రీనివాసులు,హౌసింగ్ ఏఈ వెంకటేశ్వర్లు, ఏపీవో శ్రీవిద్య, టిడిపి నాయకులు చల్ల వీరాంజనేయులు, అంగన్వాడి వాడి సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, సచివాలయం ఉద్యోగులు, విద్యార్థులు  తదితరులు పాల్గొన్నారు.

About Author