NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

65 లీటర్ల నాటు సారా స్వాధీనం… ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

1 min read

ప్యాపిలి , న్యూస్​ నేడు:  ప్యాపిలి మండల పరిధిలోని అలేబాదు తండాలో 65 లీటర్ల నాటు సారాను స్వాధీన పరచుకొని ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎక్సేంజ్ సిఐ వరలక్ష్మి, ప్యాపిలి సిఐ వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం వారు మాట్లాడుతూ ఎక్సేంజ్ మరియు ప్యాపిలి జలదుర్గం రాచర్ల పోలీసులతో కలిసి అలే బాద్ తండాలో  గ్రామంలో దాడులు నిర్వహించి దాడుల్లో 65 లీటర్ల నాటు సారాను స్వాధీనం పరుచుకొని గ్రామానికి చెందిన ముదావత్ హేమానాయక్, ముదావత్ లక్ష్మీనాయక్ ల పై కేసు నమోదు చేసుకుని అరెస్టు చేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో  ప్యాపిలి ఎస్ఐ మధుసూదన్, జలదుర్గం ఎస్సై నాగార్జున, రాచర్ల ఎస్సై రమేష్ బాబు, ఎక్సైజ్ ఎస్సై సోమశేఖర్ రావు తదితరులు ఎక్స్ జ్  సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *