నాటు సారా పై దాడులు…
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు ప్రోహి బిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఓర్వకల్లు మండలం గుమితం తాండ మరియు గుడుంబాయి తండా గ్రామాలలో నాటు సారా పై దాడులు నిర్వహించడం జరిగింది అందులో గుమితం తండాలో సుమారు 400 మీటర్ల బెల్లం ఓట మరియు 15 లీటర్ల నాటు సారాయిని ధ్వంసం చేయడం జరిగినది తదుపరి విచారణలో సదరు బెల్లం పూట మరియు నాటు సారాయి లక్ష్మీబాయి మరియు లోకానాయక్ గా తెలిసినది వీరిని త్వరలో అరెస్టు చేయడం జరుగుతుంది. అనంతరం గుడుంబాయి తండాలో శివారు ప్రాంతంలో దాడులు చేయగా సుమారు 600 లీటర్ల నాటు సారు నాటు సారాకు ఉపయోగపడు బెల్లం పూట మరియు 15 లీ. నాటు సారాను ధ్వంసం చేయడం జరిగినది వీరిని ఎవరిది అనేది త్వరలో గుర్తించడం జరుగుతుంది . ఈ దాడులలో సీఐ చంద్రహాస్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ కృష్ణ మరియు ఎస్ఐ మధు మరియు సిబ్బంది రామలింగయ్య చంద్రపాల్ రామచంద్రుడు మరియు వీరన్న పాల్గొన్నారు అనంతరం గ్రామసభ నిర్వహించి వారికి అవగాహన కల్పించడమైనది నవోదయం కార్యక్రమంలో భాగంగా నాటు సారా పూర్తికా నిర్మూలించాలన్న ఉద్దేశంతో నాటు సారా రహిత గ్రామంగా చేకూరాలని వారికి తెలియజేశారు.

