ప్రాణాంతక వ్యాధులు కలగజేసే దోమ కాటుకు గురి కాకండి
1 min read

ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
పేదలకు దోమకాటు నివారణ కోసం దోమతెరలు, మస్కిటో కాయిల్స్ పంపిణీ చేసిన సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శర్మ .
కర్నూలు, న్యూస్ నేడు: ప్రాణాంతక వ్యాధులను కలుగజేసే దోమకాటుకు గురికాకుండా ప్రతి ఒక్కరు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. కర్నూల్ నగరంలోని గాయత్రి ఎస్టేట్లో ఉన్న శ్రీ గురుదత్త పాలి క్లినిక్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో దోమకాటుకు గురికాకుండా పేదలకు దోమతెరలను, మస్కిటో కాయిల్స్ ను ఆయన పంపిణీ చేశారు .ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో దోమల ఉధృతి అధికంగా ఉంటుందని చెప్పారు. మురికి నీరు, మంచినీటి లో ఉండే దోమల వల్ల వివిధ రకాల వ్యాధులు వస్తాయని తెలియజేశారు. ముఖ్యంగా దోమ కాటు వల్ల జపనీస్ ఎన్ కపలైటిస్, ఎల్లో ఫీవర్, జికా వైరస్, బోదకాలు వంటి వ్యాధులు వస్తాయని తెలిపారు. ముఖ్యంగా బకెట్లలో, గచ్చుల్లో ,టైర్లలో ,పూల కుండీలలో ,చెరువుల్లో నిలిచిన నీటిలో ఉన్న దోమల వల్ల డెంగ్యూ లాంటి ప్రాణాంతక వ్యాధి వస్తుందని చెప్పారు. డెంగ్యూ వ్యాధిలో జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు తో పాటు రక్తంలో ప్లేట్లెట్స్ తగ్గి వ్యాధి తీవ్రత అధికమైతే కోమా లోకి పోయి చనిపోయే అవకాశం ఉందని ఆయన వివరించారు వర్షాకాలంలో దోమకాటుకు గురి కాకూడదని ఉద్దేశంతోనే పేదలకు తన వంతుగా దోమతెరలు మస్కిటో కాయిల్స్ పంపిణీ చేసినట్లు తెలిపారు.

