విద్యార్థులకు ఉడకని కోడి గుడ్ల..మజాకా
1 min read
విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లోపం..
నందికొట్కూరు, న్యూస్ నేడు: పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యతగా ఉండాలని అదేవిధంగా మెనూ తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం చెబుతూ ఉంటే ఇక్కడ మాత్రం విరుద్ధంగా పాటిస్తూ విద్యార్థులకు ఉడకని గుడ్లు ఇవ్వడంతో వాటిని విద్యార్థులు తినకుండా పారివేసిన సంఘటన నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం బిజినవేముల గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. మధ్యాహ్న భోజనం ఉడికి ఉడకని అన్నం సరిగా ఉడకని కోడిగుడ్లు నీటి సాంబారు పప్పు తినలేక ఉపవాసం ఉండి ఇంటికి వచ్చి అన్నం అడుగుతేే బడిలో తిన్నావు కదా అని ఇంటిలో భోజనం లేదు.అని రాత్రికి ఇంట్లో చేసినటువంటి భోజనం తిని చిన్నారులు నిద్రపోతున్న పరిస్థితి ఇప్పుడు చాలాచోట్ల కనిపించిన కూడా కనిపించినట్లు వ్యవహరిస్తున్నారు.భోజనం ఉడకని కోడిగుడ్లు సరిగా భోజనం చేయని చిన్నారులు వారి ఆవేదన మనకే తెలియని పరిస్థితి ఇప్పటికైనా సంబంధిత గ్రామ సర్పంచ్ నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించే విధంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది.చిన్నపిల్లలు చిక్కీలు మధ్యాహ్నం ఇవ్వమని అడిగితే ప్రధానోపాధ్యాయులు మీరు సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళండి అని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. మధ్యాహ్నం విద్యార్థినీ విద్యార్థులు భోజనం చేసిన అనంతరం క్లీన్ చేయకుండా ఎక్కడ ఉన్న అన్నం అక్కడే కనిపించడం చాలా బాధాకరమైన విషయం అని తల్లిదండ్రుల ఆవేదన.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగ ప్రసాద్ ను వివరణ కోరగా మంచి వంటలు వండడం జరుగుతుంది.ఎలాంటి తప్పిదం జరిగినా కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడమే మా లక్ష్యం అని తెలియజేయడం జరిగింది.పాఠశాలల మధ్యాహ్న భోజనంపై విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

