ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా ముండ్ల శ్రీనివాసులు రెడ్డి
1 min read

డైరెక్టర్లుగా నీలం గోవింద్ రెడ్డి, మాకం వెంకటసుబ్బయ్య( భరత్),
చెన్నూరు, న్యూస్ నేడు : చెన్నూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా మండలంలోని ఓబులంపల్లి గ్రామానికి చెందిన ముండ్ల శ్రీనివాసులు రెడ్డి నియమితులయ్యారు.అలాగే డైరెక్టర్లుగా స్థానిక బ్రాహ్మణ వీధికి చెందిన నీలం గోవింద్ రెడ్డి, మండలంలోని చిన్న మాచుపల్లి గ్రామానికి చెందిన మాకం వెంకటసుబ్బయ్య( భరత్) ఎంపికయ్యారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు. పుత్త నరసింహారెడ్డి, కమలాపురం నియోజకవర్గం శాసనసభ్యులు పుత్త కృష్ణ చైతన్య రెడ్డి వీరి పేర్లను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన విషయం తెలిసిందే. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మూడో విడతలో జిల్లాలో 27 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు చైర్మన్ అలాగే ఇద్దరు డైరెక్టర్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు చెన్నూరు మండలంలో ముగ్గురికి నామినేటెడ్ పదవులు దక్కుతున్నాయి. చైర్మన్ గా ఎంపికైన ముండ్ల శ్రీనివాసులు రెడ్డి కి కష్టపడి పనిచేసిన వ్యక్తిగా మండలంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పటినుంచి తెలుగుదేశం పార్టీలో కీలక పదవి లో పనిచేస్తూనే 2014లో గుర్రంపాడు ఎంపిటిసి గా ఆయన పోటీ చేసి ఓడిపోయారు.అలాగే 2021లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో శ్రీనివాసులు రెడ్డి తన తల్లిని పోటీ చేయించి స్వల్ప ఓట్లతో ఓటమి పాలయ్యారు. బ్రిటీష్ కాలం నుంచి గుర్రంపాడు గ్రామపంచాయతీ ఏకగ్రీవం అవుతూ వచ్చేది కానీ ఓబులంపల్లి గ్రామం లో మొట్టమొదటిసారి సర్పంచ్ గా పోటీచేయించడం ద్వారా ఆయన రాజకీయాలలో తనదైన శైలిలో చురుకైన పాత్ర వహించారు . ఇలా రెండుసార్లు ఎన్నికల్లో పోటీచేసి స్వల్ప తేడాతో ఓటమిపాలైనప్పటికీ గుర్రంపాడు గ్రామపంచాయతీ ప్రజలు ముండ్ల శ్రీనివాసులు రెడ్డి పట్ల ఎంతో ప్రేమాభిమానాలు కురిపించారు. గత సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి గెలుపు కోసం ఎంతో కృషి చేయడం జరిగింది. పార్టీకి తను చేసిన సేవలను గుర్తించిన అధిష్టానం అలాగే టిడిపి రాష్ట్ర కార్యదర్శి పుత్తా నరసింహారెడ్డి, కమలాపురం శాసనసభ్యులు పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి లు నాకు ఈ పదవి ఇవ్వడం జరిగింది అన్నారు. ఈ సందర్భంగా ఆయన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే మండల కన్వీనర్ కల్లూరు విజయ భాస్కర్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇందిరెడ్డి శివారెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా డైరెక్టర్లుగా ఎంపికైన చెన్నూరు బ్రాహ్మణ విధికి చెందిన నీలం గోవింద్ రెడ్డి. చిన్న మాచు పల్లి గ్రామానికి చెందిన మాకం వెంకటసుబ్బయ్య (భరత్) ఎన్.చంద్రబాబునాయుడు.ఐటి విద్య శాఖామంత్రి లోకేష్ కి ధన్యవాదాలు తెలియజెశారు.

