ఫ్రై డే ..డ్రై డే పై అవగాహన
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: శనివారం శ్రీరామనగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఫ్రై డే డ్రై డే కార్యక్రమంలొ మాస్ మీడియా సెక్షన్ డిప్యూటీ హెల్త్ ఏడ్యూకేషన్ ఆఫీసర్ పద్మావతి పాల్గొని అవగాహనా కల్పించినారు. ఇంటిలోనూ ,పరిసరాల్లో ఉండే చిన్న నీటి నిలువల్లో పెరుగుతాయని, పాత వస్తువులు ,పూల కుండీలు, కూలర్లు, టైర్లు,తాగి పడేసిన కొబ్బరి బోండాలు,రుబ్బు రోళ్ళలో ఉన్న నీటి నిల్వల్లో పెరిగి డేంగి, చికున్ గన్యా వ్యాధులు వ్యాప్తి చేస్తాయని తెలిపారు. వారానికి ఒకసారి టిని తొలగించి వాడుకోవాలని, తప్పనిసరిగా నీటి పాత్రలపై మూతలు ఉంచాలని తెలిపారు అనంచికున్ గన్యా వ్యాధిపై అవగాహన కల్పించినారు. వైరస్ ద్వారా వచ్చే ఈ వ్యాధి దోమల ద్వారా వ్యాప్తి చెందుతుందని,తలనొప్పి,వాంతులు వికారముతో హఠాత్తుగా వచ్చే జ్వరము,చేతి వేళ్లు,కాళ్ళు నుండి మొదలుకొని శరీరంలోని అన్నీ కీళ్లని బాధిస్తుంది ,కీళ్ల నొప్పుల వలన సరిగ్గా నిలబడలేని పరిస్తితి,జ్వరము తగ్గినా ఈ నొప్పులు ఎక్కువ కాలము ఉంటాయని తెలిపారు.ఈ కార్యక్రమములో ఆశా కార్యకర్తలు మరియు ప్రాజెక్షనిస్ట్ ఖలీల్ పాల్గొన్నారు,

