ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం పకడ్బందీగా అమలు చేయాలి
1 min read

ఎస్సీ, ఎస్టీ బాధిత కుటుంబాలకు పరిహారం త్వరితగతిన మంజూరు చేయాలి
జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్
కర్నూలు, న్యూస్ నేడు : ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం పకడ్బందీగా అమలు చేయాలని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అధికారులను ఆదేశించారు.శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఎస్సీ,ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలు కు సంబంధించిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో జేసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అత్యాచార బాధిత కుటుంబాలకు ఉపాధి, ఇంటి స్థలం, అర్హత కలిగిన ఇతర ప్రయోజనాలను త్వరితగతిన మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు..ఎస్సీ, ఎస్టీ తదితరులపై అత్యాచారాలు జరగకూడదని, అలాంటివి జరిగితే చట్ట ప్రకారం కేసులు బుక్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం అనంతరం సఫాయి కర్మచారుల సమావేశం నిర్వహించారు. పారిశుధ్య కార్మికులకి గ్లోవ్స్ , ఇతర పరికరాలను అందించాలని జాయింట్ కలెక్టర్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు.సమావేశంలో హౌసింగ్ పిడి చిరంజీవి, కర్నూలు ఆర్డీవో సందీప్ కుమార్, పత్తికొండ ఆర్డీఓ భరత్ నాయక్, జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారిక అధికారి బి.రాధిక, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి సురేష్, తదితరులు పాల్గొన్నారు.

