NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నాలుగవ తరగతి  ఉద్యోగులకు యూనిఫామ్ లు  అందజేత

1 min read

అందజేసిన మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు

సంక్రాంతి పండుగ వాతావరణం తలపించిన కార్పొరేషన్ కార్యాలయం

ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య  సూచనలతో కార్యక్రమం

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు : మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న నాలుగవ తరగతి ఉద్యోగులందరికీ వారికి అందవలసిన బెనిఫిట్స్ అన్ని సమయానికి అందిస్తున్నామని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం మేయర్ ఛాంబర్ లో బుధవారం జరిగిన కార్యక్రమంలో మేయర్ నూర్జహాన్ మాట్లాడుతూ ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య  సూచనల మేరకు సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకుని నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న అన్ని విభాగాలకు చెందిన నాలుగవ శ్రేణి సిబ్బందికి2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పబ్లిక్ హెల్త్ వర్కర్లు,నాన్ పబ్లిక్ హెల్త్ వర్కర్లు, పరిపాలన విభాగానికి సంబంధించిన నాలుగో తరగతి ఉద్యోగులు,పీహెచ్ మేస్త్రిలు,డ్రైవర్లు,ఎంఎన్ఓలు,ఎఫ్ ఎన్ ఓలు,ఆయాలు మొదలగు 296 మందికి రెండు సంవత్సరాలకు సంబంధించిన యూనిఫామ్ మేయర్ చేతుల మీదుగా అందించారు.మగవారికి రెండు జతలు, ఆడవారికి మూడు జతలు యూనిఫామ్,ఒక్కొక్కరికి మూడు టవల్స్ ఇచ్చామని మేయర్ నూర్జహాన్ తెలిపారు. అదేవిధంగా నాలుగవ తరగతి ఉద్యోగులకు సంబంధించి రావలసిన అన్ని బెనిఫిట్స్ సమయానికి అందిస్తున్నామన్నారు.  ఏలూరు నగర ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికి నగరం పరిశుభ్రంగా ఉండడానికి పబ్లిక్ హెల్త్ వర్కర్లు చేస్తున్న సేవలు మరువలేని అని మేయర్ కొనియాడారు.కమిషనర్ ఏ.భాను ప్రతాప్ మాట్లాడుతూ నాలుగవ తరగతి ఉద్యోగులకు అందవలసిన ఇంక్రిమెంట్స్, ఏరియర్స్,పదోన్నతులు ఎప్పటికప్పుడే అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ డి.శ్రీనివాస్,డిప్యూటీ కమిషనర్ బి.శివారెడ్డి,మేనేజర్ మూర్తి, సూపర్నెండెంట్ సిరాజుద్దీన్,కార్పొరేటర్లు జిన్నూరు కనక నరసింహారావు,వంకదారు ప్రవీణ్,సబ్బన శ్రీనివాసరావు,పాము శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.

About Author