NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

8,43,514 రూ.ల సీఎంఆర్ ఎఫ్ ఎమ్మెల్యే పంపిణీ

1 min read

రైతులకు నూతన పాస్ పుస్తకాల పంపిణీ..

నందికొట్కూరు, న్యూస్​ నేడు:  నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలంలోని వివిధ గ్రామాల్లో 8 లక్షల 43 వేల 514 రూ.ల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య మంగళవారం పంపిణీ చేశారు.చెక్కులను మంజూరైన 17 మంది లబ్ధిదారుల చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. చెక్కులు పంపిణీ చేసిన వివరాలు:తర్తూరు గ్రామానికి చెందిన షేక్ నౌషిన్ గారికి 10 వేలు,గడ్డం చెన్నారెడ్డి- 40,617రూ.లు,కురువ శేషన్న 30,786 రూ.లు,పూజారి పెద్ద పుల్లారెడ్డి 25,350 రూ.లు, మండ్లెం గ్రామానికి చెందిన ఆడపల రవణమ్మ-60 వేల రూ.లు,చంద్ర కళావతమ్మ -35,227రూ.లు గొల్ల రాధమ్మ- 33,484 రూ.లు,బన్నూరు కె లక్ష్మీదేవి-25 వేలు, పోతులపాడు చాకలి పుల్లయ్య 76,550 రూ.లుతాటిపాడు షేక్ లాల్ భీ గారికి 30,786 రూ.లు,షేక్ మైమున్ బీ-28,400 రూ.లు,ఈడిగ హుస్సేనయ్య-25 వేలు,గుండ్రాతి జనార్ధన్ గౌడ్ -58,486 రూ.లు,తరిగోపుల రేణుక-34,850 రూ.లు,చాకలి మద్దిలేటి-1,22,798 రూ.లు, కురువ వర్ణిక-1,65,170,పారు మంచాల బోయ మధుస్వామి -41,010 రూ.ల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.మండ్లేం గ్రామంలో నూతనంగా నిర్మించిన రెండు లక్షలతో మినీ గోకులం షెడ్డు ను ఎమ్మెల్యే ప్రారంభించారు. తర్వాత లింగాపురం గ్రామంలో రైతులకు పట్టాదారు నూతన పాస్ పుస్తకాలను రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గుండ్రెడ్డి మోహన్ రెడ్డి,కడియం వెంకటేశ్వర్లు యాదవ్,గిరీశ్వర్ రెడ్డి,ఎంపీడీవో,తహసిల్దార్, ఏపీవో,లింగాపురం సర్పంచ్ నాగార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author