NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గుంటూరు నగరంలో రేషన్ డీలర్ అకాల మరణం

1 min read

గత 30 సంవత్సరాల నుండి షాప్ నెంబర్ 12 కు డీలర్ గా విజయ్ చౌదరి విధులు

డీలర్ విజయ్ చౌదరి అకాల మరణంతో డీలర్లు ఆవేదన

ఆదాయం తక్కువ,పని భారం ఎక్కువతోనే డీలర్ల అకాల మరణాలు

రాష్ట్ర రేషన్ డీలర్ అసోసియేషన్ సంఘాలు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: గుంటూరు నగరంలో రేషన్ డీలర్ విజయ్ చౌదరి అకాల మరణంతో డీలర్లు ఆవేదన గురయ్యారు.గత 30 సంవత్సరాల నుండి షాప్ నెంబర్ 12 కు డీలర్ గా విజయ్ చౌదరి పనిచేస్తున్నారు.ఈ నెలలో ఒక కార్డుదారుడు రేషన్ కు వస్తే లేవని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే రైస్ అయిపోయినవి మరలా పోర్టబిలిటీ రైస్ వస్తాయి ఇస్తానని అతను అధికారులకు ఫిర్యాదు చేశాడు.పోర్టబుల్టి రైస్ కోసం గోడౌన్ కు ఎండలో నాలుగైదు సార్లు తిరగటం వలన ఎండ తీవ్రతకు వడదెబ్బ కు గురయ్యాడు.ఇంటికి వచ్చి మెట్లు పైన సొమ్మసిల్లి పడిపోయాడు, కొంతసేపటికి తేరుకొని వేరే డీలర్ కు ఫోన్ చేయగా అతను వచ్చి హాస్పిటల్లో చేర్చారు.ట్రీట్మెంట్ తీసుకుంటూ హార్ట్ ఎటాక్ తో నిన్న మరణించారు.రేషన్ డీలర్ల నిత్యo టెన్షన్ తో సతమతమవుతూ వినియోగదారులకు అందుబాటులో ఉంటూ,వచ్చే ఆదాయం చాలా తక్కువ కానీ అధికారుల ఒత్తిడి, కార్డుదారుల ఒత్తిడి ఎక్కువగా ఉన్నదని రాష్ట్ర రేషన్ డీలర్ల అసోసియేషన్ సంఘాలు మండిపడుతున్నాయి.ఎండియు ఆపరేటర్లు ఉన్నప్పుడే రేషన్ డీలర్ రిలాక్స్ గా ఎటువంటి వత్తిడి లేకుండా హాయిగా కాలం గడిపారు.కార్డుదారులు తెలుసుకోవలసిన అంశం ఏమిటంటే రేషన్ కార్డు ఒక ఏటీఎం డెబిట్ కార్డ్ లాగా పనిచేస్తుంది ఏటీఎం కార్డు లో మనం డబ్బులు తీసుకోవడానికి వెళ్తాము ఏటీఎం మెషిన్ లో డబ్బులు లేకపోతే వేరే ఏటీఎంలోకి వెళ్లి మనం డబ్బులు ఏవిధంగా ఐతే డ్రా చేసుకుంటామో అదే విధంగా ఒక షాపుకు వెళ్ళినప్పుడు అక్కడ సరుకులు లేని పక్షంలో వేరే షాపుకు వెళ్లి సరుకులు తీసుకోవాలి అనే విషయం కార్డుదారుడికి తెలియజేయవలసిన బాధ్యత రేషన్ డీలర్ పైన అధికారుల పైన ఉన్నది. రేషన్ డీలర్లు ఎటువంటి ఒత్తిడికి లోనవ్వకుండా  విధులను నిర్వహించండని పలువురు సూచిస్తున్నారు. మన పైన ఆధారపడి కుటుంబాలు ఉన్నాయి ప్రాణాలు కంటే ఏది ముఖ్యం  కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *