NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రమోషన్ తో బదిలీపై వెళ్తున్న వైద్యులను సన్మానించిన ఎమ్మెల్యే 

1 min read

పత్తికొండ, న్యూస్​ నేడు:  స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో విధులు నిర్వహిస్తూ, ప్రమోషన్ తో బదిలీపై వెళ్తున్న వైద్యులను పత్తికొండ ఎమ్మెల్యే కే ఈ శ్యామ్ కుమార్ సన్మానించారు. ప్రభుత్వ వైద్యశాలలో శనివారం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో భాగంగా గత ఐదు సంవత్సరాలుగా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ ఆది నాగేష్ మరియు వెంకటేశ్వర్లు ప్రమోషన్ తో బదిలీపై వెళ్తున్నారు. ఏ మేరకు వైద్యులను ఎమ్మెల్యే కే ఈ శ్యాం కుమార్ దుశ్యాలువ పూలమాలలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పత్తికొండ ప్రభుత్వ వైద్యశాలలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ,  మంచి పేరు తెచ్చుకున్నారని బదిలీపై వెళ్తున్న డాక్టర్లను కొనియాడారు. గతంలో ఇక్కడ సరైన వైద్య సేవలు లేక ప్రజలు ఆదోని కర్నూల్ హాస్పిటల్ కి వెళ్లి వైద్యం చేయించుకునే వారని అన్నారు. కానీ గత టిడిపి ప్రభుత్వంలో ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్లు కొరత లేకుండా మరియు మందుల కొరత లేకుండా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేందుకు ప్రభుత్వం పాటుపడిందన్నారు.అందుకు తగ్గట్టుగా ఇక్కడ పనిచేసే డాక్టర్లు తమ వైద్య వృత్తి పట్ల అంకితభావంతో పనిచేసి ప్రజలలో మంచి పేరు తెచ్చుకున్నారని, వీరి సేవలను ప్రజలు ఎప్పటికీ మరచిపోరని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని, ఆసుపత్రిలో ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని వైద్యులను కోరారు. బదిలీపై వెళ్తున్న వైద్యుల స్థానంలో మరొకరిని నియమించి ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందేలా చూస్తామని చెప్పారు.

About Author