NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సీనియర్ సిటిజన్స్ ఎన్నికల అధికారిగా వీరా రావు

1 min read

అన్నమయ్య జిల్లా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ కు అక్టోబర్ 11న ఎన్నికలు

సీనియర్ సిటీజన్స్ ఆరోగ్య, ఆర్థిక ప్రయోజనాలు ముఖ్యం

జిల్లా అధ్యక్షులు డా. ఎన్ మునిగోపాల కృష్ణ

మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిధి   : ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసి యేషన్ అన్న మయ్య జిల్లా కేంద్రం మదనపల్లె లో ఆదివారం సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర ఆర్గనై జింగ్ సెక్రటరీ, అన్నమ య్య జిల్లా అధ్యక్షులు డా. ఎన్ ముని గోపాల కృష్ణ అధ్యక్షతన సమా వేశం జరిగింది. ఈ సమావేశానికి కార్యదర్శి కరుణా కర్, కోశాధికారి కుమారస్వామి, గౌరవ సలహా దారులు ప్రొఫెసర్ శ్రీనివాసులు, గొల్ల పూడి తిరుపతి రావు లు హాజ రయ్యారు.ఇందులో  సర్వసభ్య సమా వేశం అనంతరం కార్యవర్గ  సమా వేశం నిర్వహించా రు. ఈ సమావేశం లో  అక్టోబరు 11వ తేదీన అన్నమయ్య జిల్లా సీనియర్ సిటిజన్స్ అసోసి యేషన్ కు ఎన్ని కలు నిర్వహించా లని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ ఎన్నికలకు ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్స్ జాతీయ జాయింట్ సెక్రెటరీ, ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసి యేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు  వీరా రావు  ఎన్నికల అధికారిగా నిర్ణ యిస్తూ సర్వసభ్య సమావేశం ఏక గ్రీవంగా తీర్మా నించారు. అక్టోబర్ మాసంలో ప్రపంచ వయోవృద్ధుల దినోత్స వాన్ని మదనపల్లె పట్టణం లో ఘనంగా నిర్వ హించాలని  తీర్మా నించారు. జాతీయ స్థాయిలో రైల్వే రాయితీ పునః పరి శీలించాలని,  సీనియర్ సిటిజన్స్ కు ప్రత్యేకమంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ముని గోపాల కృష్ణ కోరారు. మాజీ కోపరేటివ్  బ్యాంక్ మేనేజర్ డాక్టర్ గొల్లపూడి తిరుపతి రావు ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ పవిత్ర  మాట్లాడుతూ తమ బ్యాంకులో శ్రావణ సహకార డిపాజిట్ స్కీమ్ లో 60 సంవత్సరాల పై పడ్డ వయోవృద్ధు లకు 8.20శాతం, 80 ఏళ్ల పై పడ్డ వారికి 8.30 శాతం వడ్డీ లభిస్తుందని కావున ఈ అవకాశా న్ని సద్విని యోగం చేసుకోవాలని కోరారు. అంజన స్కాన్స్ అండ్ డయాగ్నస్టిక్స్ కు చెందిన దేవిచంద్ మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ కు తాము 25 శాతం రాయితీ తో సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. గౌరవ సలహా దారులు ప్రొఫెసర్ శ్రీనివా సులు, గొల్లపూడి తిరుపతి రావు లు మాట్లాడుతూ అక్టోబర్ మాసం లో జరగబోవు సీనియర్ సిటిజన్స్ జిల్లా ఎన్నికల గురించి ఎన్నికల అధికారిగా వీరా రావును ఏకగ్రీవం గా ఆమో దించడం హర్షనీయ మన్నారు. ఎన్నికలు ఏకగ్రీవం గా జరగడానికి అందరూ సంఘీ భావం ప్రకటించా లని కోరారు. ప్రపంచ వయో వృద్ధుల దినోత్సవం రోజు వయసులో పెద్దలైన వారికి సన్మాన కార్యక్రమం నిర్వహిస్తామని ప్రక టించారు. అక్టోబర్ 11వ తేది కాలువ పల్లి కృష్ణమూర్తికి, వారి సతీమణి లక్ష్మీదేవికి, శకుంత లమ్మ కి ఘనంగా ఉత్తమ సీనియర్ సిటిజన్స్ గా ఘనంగా సన్మా నించాలని తీర్మా నించారు. ఈ కార్య క్రమం జాతీయ నాయకులైన వీరా రావు సమక్షంలో నిర్వహించాలని  నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ జగన్ మోహన్, శకుంత లమ్మ, జాయింట్ సెక్రెటరీ వి ఎం నాగరాజు, మహిళా ప్రతినిది సరస్వతి, రాష్ట్ర ప్రివిలేజ్  కమిటీ మెంబర్  ధనలక్ష్మి, మహ బూబ్ భాషా, కాలువపల్లి కృష్ణ మూర్తి, పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు తిమ్మయ్య, ప్రముఖ నవల రచయిత టీఎస్ఏ కృష్ణ మూర్తి  లు పాల్గొన్నారు.తదుపరి సమావేశం  అక్టోబర్ 11వ తేది  జరుగుతుందని కార్యదర్శి కరుణా కర్ తెలియజేశారు.  నూతనంగా  టీచర్ మునిస్వామి,లక్ష్మీ దేవి లు సభ్యులుగా చేరారు.

About Author