NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కొప్పాకలో వేలాంగిణి మాత వార్షికోత్సవ వేడుకలు

1 min read

పాల్గొన్న దెందులూరు ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్

 మందిర అభివృద్ధికి,షెడ్డు నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తా

కృతజ్ఞతలు తెలిపిన సంఘ సభ్యులు,గ్రామస్తులు

ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ గారి సహకారంతో త్వరలోనే అభివృద్ధి పనులకు శంకుస్థాపన

బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పెదవేగి మండలం,కొప్పాకలో అధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ స్పష్టం చేశారు.పెదవేగి మండలం కొప్పాక గ్రామంలో జరిగిన వేలాంగిణి మాత 13వ వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేలాంగిణి మాతకు పూలమాల వేసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా విచారణ గురువులకు, సంఘస్తులకు వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ కొప్పాక వేలాంగిణి మాత మందిర అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. వచ్చే ఏడాది ఉత్సవాల నాటికి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్  సహకారంతో మందిరం వద్ద భక్తుల సౌకర్యార్థం భారీ షెడ్డును నిర్మించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ మేరకు శంకుస్థాపన పనులకు త్వరలో శ్రీకారం చుట్టాలని విచారణ గురువు ఫాదర్ ఆశీస్సీ ఫ్రాన్సి కి సూచించారు.వేడుకలకు విచ్చేసిన క్రైస్తవ విశ్వాసులు,సంఘ సభ్యులు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని ఎంతో ఆప్యాయంగా పలకరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఎమ్మెల్యే వారిని పలకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం గ్రామంలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో విచారణ గురువులు,సంఘ పెద్దలు, కూటమి నాయకులు మరియు పెద్ద సంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *