NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉత్తమ ప్రశంసా పత్రం అందుకున్న వెలుగు సిసి

1 min read

మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్​ నేడు : నంద్యాల జిల్లా మిడుతూరు మహిళా మండలి సమాఖ్యలో వెలుగు సీసీ గా పనిచేస్తున్న డి భాను కు ఉత్తమ అవార్డును అందుకున్నారు.నంద్యాల జిల్లా కేంద్రంలో టౌన్ హాల్ లో జిల్లా స్థాయిలో మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి,మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మరియు డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు.నందికొట్కూరు నియోజకవర్గానికి గాను భాను ఒక్కరే ఉత్తమ అవార్డుకు ఎంపికయ్యారు.మంత్రులు మరియు డిఆర్ డి ఏ ప్రాజెక్టు డైరెక్టర్ భానును శాలువాతో సత్కరిస్తూ ఉత్తమ అవార్డు ప్రశంసా పత్రాన్ని అందజేశారు.మిడుతూరు మండలంలోచౌటుకూరు,గుడిపాడు,49 బన్నూరు,దేవనూరు,సున్నం పల్లె,చింతలపల్లె,కాజీపేట, సుంకేసుల గ్రామాల్లో ఉన్న పొదుపు సంఘాలను బలోపేతం చేయుటకు గాను కమ్యూనిటీ కో ఆర్డినేటర్ గా భాను పనిచేస్తున్నారు. ఎంఎంఎస్ సిబ్బంది భానును సత్కరించారు.

About Author