సామాజిక సమానత్వానికి మార్గదర్శి సావిత్రిబాయి పూలే – ఎమ్మెల్యే
1 min read

ఆలూరు న్యూస్ నేడు: తాడేపల్లిలోని వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయంలో భారతదేశ తొలి మహిళా గురువు, సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి పాల్గొని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే మహిళల విద్యాభివృద్ధి, సామాజిక సమానత్వం కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. మహిళలకు విద్య అందించడంలో ఆమె చేసిన పోరాటం దేశ చరిత్రలో ఎంతో గొప్పదని పేర్కొన్నారు. సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఆమె చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, వైఎస్ఆర్సిపి సీనియర్ నేతలు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

