పి.ఎం. శ్రీ లక్ష్యాల అమలు తీరు… అభినందనీయం
1 min read

ఐఈఎస్ మరియు జాయింట్ సెక్రటరి డా. ఇషితా గంగూలి త్రిపాఠి
కర్నూలు కేంద్ర విద్యాలయాన్ని పరిశీలించిన కేంద్ర బృందం
కర్నూలు, న్యూస్ నేడు : ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా ( పిఎం శ్రీ ) లక్ష్యాల అమలు చేసే విధానంలో కర్నూలు కేంద్ర విద్యాలయం సిబ్బంది పని తీరు ప్రశంసనీయమన్నారు ఐఈఎస్ మరియు జాయింట్ సెక్రటరి డా. ఇషితా గంగూలి త్రిపాఠి . పి.ఎం. శ్రీ పాఠశాలల సమీక్ష తనిఖీలో భాగంగా ఢిల్లీ నుండి ఐఈఎస్ మరియు జాయింట్ సెక్రటరీ డాక్టర్ ఇషితా గంగూలి త్రిపాఠి మంగళవారం కర్నూలులోని పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయాన్ని సందర్శించారు. సైన్స్ లాబొరేటరీలు, కంప్యూటర్ ల్యాట్లు, లైబ్రరీ మరియు ఇన్నోవేషన్ స్కిల్ డెవల్ మెంట్ సెంటరీతో సహా పాఠశాలలోని వివిధ సౌకర్యాలను ఆమె పరిశీలించారు. పిఎం శ్రీ పథకం కింద అందించబడిన మౌలిక సదుపాయాలు, అప్ గ్రేడ్లు మరియు డిజిటల్ లెర్నింగ్ సౌకర్యాలను ఈ సందర్భంగా ఆమె తనిఖీ చేశారు. అదేవిధంగా ఇంటరాక్టివ్ ప్యాసెల్ ఉపయోగించి బోధన నిర్వహించబడి ప్రాథమిక విభాగం ప్రదర్శన తరగతిని ఆమె పరిశీలించారు . అనంతరం డాక్టర్ త్రిపాఠి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. మరియు పి.ఎం. శ్రీ చొరవ యొక్క లక్ష్యాలను సమర్ధవంతంగా అమలు చేయడంలో పాఠశాల ప్రయత్నాలను ప్రశంసించారు. పిఎం శ్రీ ఫ్రేమ్ వర్క్ కింద పాఠశాల చేపట్టిన వివిధ కార్యకలాపాలు మరియు విజయాలను వివరిస్తూ నేహా వివరణాత్మక పనికి పాయింట్ ప్రజెంటేషనను ప్రదర్శించారు. కార్యక్రమంలో జిల్లా విద్యా అధికారి సుధాకర్ , అదనపు ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ డాక్టర్ ఎస్.బి. లోకరాజు, కేజీబివి ఫ్యాకల్టీ , ఏపీ సమగ్ర శిక్ష అమరావతి పి. జయల క్ష్మి, ఏపీ రెసిడెన్షియల్ కళాశాల ప్రిన్సిపాల్ దినేష్ , పీఎం శ్రీ కేంద్ర విద్యాలయం ప్రధానోపాధ్యాయుడు టి. వెంకటేశ్వర్లు , ఉపాధ్యాయులు శశిబాల, పి. ఆంజనేయులు, షావలి తదితరులు పాల్గొన్నారు.



