NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వివేకానందుని బోధనలు ఎప్పటికీ ఆచరణీయం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: సమున్నత భారతీయ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయడంలో స్వామి వివేకానందుల కృషి ఎంతో ఉందని రాయలసీమ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బి. విజయ కుమార్ నాయుడు కొనియాడారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని వర్సిటీ సెనేట్ హాలులో హాలులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన యూనివర్సిటీ అధికారులతో కలిసి వివేకానందులవారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. 1984లో భారత ప్రభుత్వం వివేకానందుల జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించిందన్నారు. యువత విద్యా ఉపాధిరంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవడంతో పాటు సరైన వ్యక్తిత్వాన్ని సాధించుకోవాలని డాక్టర్ బి. విజయకుమార్ నాయుడు పిలుపునిచ్చారు. సమున్నతమైన శీలనిర్మాణమే ప్రతివ్యక్తికి అవసరమన్న వివేకానందుని బోధనలు ఎప్పటికీ ఆచరణీయాలని, దేశ జనాభాలో అధికంగా ఉన్న యువత సక్రమమార్గంలో పయనిస్తూ దేశ భవితకు మార్గదర్శకంగా నిలవాలని వర్సిటీ   సిడిసి  డీన్ మరియు ఇంజినీరింగ్ కాలేజి ప్రిన్సిపాల్ ఆచార్య పి. వి. సుందరానంద్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.











Dxtfh

fctxs

About Author