వాలీబాల్ క్రీడాకారులకు ప్రోత్సహించడానికి తాము ఎల్లప్పుడూ సిద్ధమే
1 min read
– సోషియో స్పోర్ట్స్ సంస్థ సీ.ఈ.వో. కృష్ణ వీర ఫణీంద్ర స్పష్టం.
న్యూస్ నేడు, పత్తికొండ : వాలీబాల్ క్రీడాకారులను ప్రోత్సహించడానికి తాము ఎల్లప్పుడూ సిద్ధమేనని సోషియో స్పోర్ట్స్ సంస్థ సీఈవో కృష్ణ వీర ఫణీంద్ర స్పష్టం చేశారు. సోమవారం స్థానిక జూనియర్ కళాశాల క్రీడల మైదానంలో జరుగుతున్న అంతర్ పాఠశాలల వాలీబాల్ పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పోటీలకు హాజరైన క్రీడాకారులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, 5,000 మందికి పైగా క్రీడాకారులకు స్పోర్ట్స్ మెటీరియల్ స్పాన్సర్ చేయడం ప్రతిభ కలిగిన క్రీడాకారులకు ప్రాక్టీస్ కిట్లు, బంతులు, స్పైక్స్, ఫిట్నెస్ పరికరాలు వంటి అవసరమైన సామగ్రిని అందించడం.100 మందికి పైగా క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించబడ్డాయని అన్నారు.100 మందికి పైగా ప్రతిభావంతులైన చిన్నారులను గుర్తించి, వారికి SATS, SAI లేదా మంచి అకాడమీల లో ప్రవేశం కల్పించేందుకు సహకరించడం జరుగుతుందని తెలిపారు.1,000 మందికి పైగా క్రీడాకారులకు కెరీర్ గైడెన్స్ అందిడం “ఆట తర్వాత ఏమిటి?” అనే ప్రశ్నకు సరైన మార్గదర్శకత్వం అందించి, వారి భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తామని చెప్పారు.ఈ లక్ష్యాలను చేరుకోవడం అంత సులభం కాదని, ఎన్నో కష్టాలు, ఎన్నో అవాంతరాలను ఎదుర్కోవాలన్నారు. అయినప్పటికీ, సోషియోస్పోర్ట్స్ దృఢ సంకల్పంతో ఈ లక్ష్యాలను సాధించేందుకు ముందుకు సోషియో స్పోర్ట్స్ సంస్థ సాగుతుందన్నారు. క్రీడాకారుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామన్నారు. ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని భరోసా కల్పించారు.

