NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సీఎం హామీపై బేడ బుడగ జంగం చలో అమరావతి  వాయిదా వేసుకున్నాం

1 min read

తూర్పాటి మనోహర్ రాష్ట్ర అధ్యక్షులు

కర్నూలు, న్యూస్​ నేడు: ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు  తేదీ: 06.02.2026 న కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు మండలం ,కలుగొట్ల గ్రామం నందు రైతు పట్టాదారు పాస్ పుస్తకం సభలో బేడ బుడగ జంగం కులమునకు అన్ని విధాలుగా న్యాయం జరిగేలా  ఒక ప్రత్యేక సర్కులరు ద్వారా న్యాయం చేస్తామని తెలియజేశారు.        కేంద్రం నందు పెండింగ్ లో ఉన్న బేడ బుడగ జంగం  రిజర్వేషన్ ను చట్టబద్ధత కల్పించే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.                    కనుకనే మేము తలపెట్టిన చలో అమరావతి మార్చి 10 కార్యక్రమం వాయిదా వేసుకుంటున్నాం. సీఎం  ఇచ్చిన హామీ మేరకు నంద్యాల జిల్లా, డోన్ నియోజకవర్గమునకు ఈ నెల 9వ తారీఖున వస్తున్న సందర్భంగా, తమ ఇచ్చిన మాట మేరకు  సర్కులర్ గాని జీవో గాని బుడగ జంగం కులమునకు అన్ని విధాలుగా న్యాయం జరిగే విధంగా చూడాలని,బేడ బుడగ జంగం రాష్ట్ర అధ్యక్షులు తూర్పాటి మనోహర్ ప్రభుత్వాన్ని కోరారు.          ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో ఇప్పటికే  డోన్ కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి , కోడుమూరు బొగ్గుల దస్తగిరి , ఆదోని పార్థసారధి ,ఎమ్మిగనూర్  జయనాగేశ్వర్ రెడ్డి , పార్లమెంట్ నందు బైరెడ్డి శబరి  మాట్లాడడం జరిగిందని,  ఇటు రాష్ట్రం అసెంబ్లీ నందును,  అటు కేంద్రం పార్లమెంట్ నందును, మా జాతికి జరుగుతున్న  రిజర్వేషన్            అన్యాయంపై మాట్లాడుతున్నప్పటికీ  రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు  న్యాయం  చేయాల్సి ఉండగా, ఇంకా ఇప్పటివరకు ఎలాంటి న్యాయం చెయ్యకపోవడం బాధాకరమైనదిగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.    ఎన్నేళ్లు ఈ పాలకుల ప్రభుత్వాలు బేడ బుడగ జంగం కులమునకు షెడ్యూల్డ్ రిజర్వేషన్ హక్కులు అందించలేక అన్యాయం చేస్తూనే ఊటారు.  కానీ అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపుతునరే తప్పా, సెంట్రల్ లో అక్కడ న్యాయం చేయించడం లేదు. వీటితోనే చదువులపరంగా, ఉద్యోగ, సంక్షేమ, వివిధ రకాలుగా కుల రిజర్వేషన్ లేక అన్యాయం మాకు జరుగుతూనే ఉన్నది  కనుకనే తాడోపేడో తేల్చుకుందాం అంటూ యువత, మహిళలు, పెద్ద ఎత్తున చలో అమరావతి కార్యక్రమం కదలిరావాలని నిర్ణయం తీసుకున్నాం. కానీ  సీఎం హామీతో చలో అమరావతి కార్యక్రమం వాయిదా వేసుకుంటున్నామని, హామీ నెరవేరనిచో ఉద్యమించాల్సి ఉంటుందని, రాష్ట్ర అధ్యక్షులు తూర్పాటి మనోహర్ ప్రభుత్వానికి తెలియజేశారు   ఈ కార్యక్రమంలో వివిధ మండలాల గ్రామాల నాయకులు పాల్గొన్నారు.

About Author