NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్థానిక సంస్థల ఎన్నికలకు సమష్టిగా సన్నద్ధం కావాలి..

1 min read

మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి అధ్యక్షతన కార్యక్రమం

మాజీ మంత్రి ఎమ్మెల్యే ఆళ్ల నాని మృతిపట్ల పలువురు నాయకులు,కార్యకర్తలు సంతాపం వ్యక్తం

నియోజకవర్గంలోని ప్రతి స్థానంలో పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేసి ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: దెందులూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఆదివారం పెదవేగి మండలం కొండలరావుపాలెంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.అబ్బయ్య చౌదరి  పిలుపుతో నియోజకవర్గంలోని వివిధ మండలాలు, గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో కొండలరావుపాలెం రోడ్ కిక్కిరిసిపోయింది. సమావేశ ప్రాంగణం జనసందోహంతో నిండిపోయింది.స్థానిక సంస్థల ఎన్నికలకు సమష్టిగా సన్నద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు.పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడంపై విస్తృత చర్చ జరిగింది.జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీల పదవీకాలం విజయవంతంగా పూర్తవుతున్న సందర్భంగా ఘన సన్మానం నిర్వహించారు.గ్రామస్థాయి నుంచి పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతం చేయడంపై నాయకులు దిశానిర్దేశం చేశారు. నాయకులు, కార్యకర్తల మధ్య ఐక్యత, సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.కార్యక్రమం ప్రారంభానికి ముందు ఇటీవల మృతి చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి, ఏలూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని మృతిపట్ల మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి సంతాపం వ్యక్తం చేశారు. ఆళ్ల నాని  ప్రజలకు, రాజకీయ రంగానికి అందించిన సేవలను స్మరించుకుంటూ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో కలిసి రెండు నిమిషాలు మౌనం పాటించారు.ఏ ఒక్క చోటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ నుంచి తప్పుకోదు అన్నారు.సమావేశంలో అబ్బయ్య చౌదరి గారు మాట్లాడుతూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ ఒక్క చోటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని, నియోజకవర్గంలోని ప్రతి స్థానంలో పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేసి ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసి, ప్రతి గ్రామంలో ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు.జగన్ పాదయాత్ర ఆపే సినిమా నీకు లేదు చింతమనేని అని ఎద్దేవా చేశారు.ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీరుపై అబ్బయ్య చౌదరి  విమర్శలు చేశారు.జగన్ పాదయాత్రను ఆపే సినిమా నీకు లేదు చింతమనేని. చాలా ఎక్కువ కామెడీ చేస్తున్నావు. ఏదైనా చేయాలి అనుకుంటే దెందులూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపించు. అంతేకాని చిల్లర మాటలు మాట్లాడటం కాదు” అని అబ్బయ్య చౌదరి వ్యాఖ్యానించారు.పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య ఐక్యతను మరింత బలోపేతం చేసుకుని, ప్రజలతో నిరంతరం మమేకమై పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే  దూలం నాగేశ్వరరావు (డిఎన్ ఆర్), ఎమ్మెల్సీ మరియు ఏలూరు పార్లమెంటు పరిశీలకులు వంకా రవీంద్రనాథ్, ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ , చింతలపూడి నియోజకవర్గ ఇంచార్జి కంభం విజయరాజు తదితరులు పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీల పదవీకాలం విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా వారిని ఘనంగా సన్మానించి, పార్టీకి మరియు ప్రజలకు అందించిన సేవలను అభినందించారు.పార్టీ శ్రేణుల ఐక్యత, సమన్వయం, క్షేత్రస్థాయి బలోపేతం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై స్పష్టమైన కార్యాచరణతో దెందులూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం విజయవంతంగా ముగిసింది.

About Author