NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వర్షాలకు నష్టపోయిన చేనేతలను ఆదుకోవాలి

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: ఎమ్మిగనూరు పట్టణంలోని చేనేత కుటుంబాలను కలసి వారి సమస్యలను తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి బుట్టా రేణుక ,పార్టీ సీనియర్ నాయకులు బుట్టా శివ నీలకంఠ ప్రస్తుతం తాము నష్టపోయినా ఏ ఒక్కరూ పలకరించలేదని కూటమి ప్రభుత్వంపై ఆవేదం వ్యక్తం చేసిన చేనేతలుశ్రీ మతి బుట్టా రేణుక  మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలతో మగ్గం గుంతల్లో నీరు చేరి ముడిసరుకు తడిచిపోయి, పనుల్లేక, నష్టపోయిన చేనేత కార్మికులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.వర్షాలతో గుడిసెల్లోనున్న తమ మగ్గాలతో పాటు ముడిసరుకు తడిచి నష్టపోయామని కొందరు కార్మికులు మా దృష్టికి తెచ్చారు అని మగ్గం గుంతల్లో నీళ్లు ఆగడం వల్ల వాళ్ల పనులకు ఆటంకం కలిగి పనులు లేక ఇబ్బంది పడుతున్నారు అని అన్నారు.ఎలక్షన్ ముందు చేనేతలకు ఇచ్చిన హామీలు 200 యూనిట్లు గుంత మగ్గాలకు,500 యూనిట్లు కరెంటు మగ్గాలకు, ఉచిత కరెంటు,సంవత్సరానికి 25000 /- వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.మా ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి  ప్రతి సంవత్సరం 24000/- వేలు చేనేత నేస్తం కింద ఇచ్చేవాడని, 100 యూనిట్లు ఉచిత కరెంటు చేనేతలకు అందించే వాళ్ళమని,కరోనా టైంలో కూడా చేనేతలను ఆదుకున్న ప్రభుత్వం మాదే అని అన్నారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాం లో నష్టం వాటిల్లినప్పుడు వలంటీర్లు, వార్డు సచివాలయ సిబ్బంది వాళ్ళ ఇళ్లకు వెళ్లి నష్టాన్ని తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వెంటనే సమస్య తీర్చే వాళ్ళని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రఘు, కర్నూలు జిల్లా చేనేత అధ్యక్షుడు ఎంకే శివప్రసాద్, చేనేత మల్లికార్జున,కౌన్సిలర్ అంపమ్మ,చంద్రశేఖర్, కౌన్సిలర్ నీలకంఠ, జిల్లా అధికార ప్రతినిధి కే సునీల్ కుమార్, పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు బోయబజారి,పట్టణ ఉపాధ్యక్షులు కోటకొండ నరసింహులు,మాజీ కౌన్సిలర్ మధుబాబు, మైనార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మహబూబ్ బేగ్, పట్టణ మహిళా అధ్యక్షురాలు లతారెడ్డి,నాగేంద్ర, హర్ష,రఘునాథ,మోనే శ్రీరాములు,బుట్టా ఈరన్న,ఇబ్రహీం,గిరి, 18 వ వార్డు సోమేష్,పామయ్య, జెరుబండి రఘువీర్, ఎల్ఐసి ప్రభాకర్, ఉస్మాను, ఘోర,నభి, స్టూడెంట్ సోమేష్, తదితరులు పాల్గొన్నారు.

About Author