NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రోడ్డు విస్తరణ చేసేంతవరకు ఉద్యమం చేస్తాం… సిపిఎం

1 min read

రోడ్డు విస్తరణ కోసం ధర్నా, నిరసన చేపట్టిన సిపిఎం శ్రేణులు

న్యూస్ నేడు పత్తికొండ : రోడ్డు విస్తరణ చేపట్టాలని శనివారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పత్తికొండ పట్టణంలోని స్థానిక చక్రాల రోడ్డు నుండి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి నాలుగు స్తంభాల కూడలి దగ్గర ధర్నా నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి సిఐటియు మండల కార్యదర్శి ఎం రవిచంద్ర అధ్యక్షతన వహించగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చక్రాల వెంకటేశ్వర్ రెడ్డి సీనియర్ నాయకులు రంగారెడ్డి దస్తగిరి మాట్లాడుతూ, పత్తికొండ రోడ్లు విస్తరణ పాలకులు అధికారులు చేపట్టే అంతవరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామని స్పష్టం చేశారు. పత్తికొండ ప్రజల గత 15 సంవత్సరాల నుండి ప్రజల ఆకాంక్షగా మిగిలిన రోడ్డు విస్తరణ కార్యక్రమాన్ని గత 15 సంవత్సరాల నుండి పాలిస్తున్నటువంటి పాలకులు అధికారులు కేవలం హామీల వరకే పరిమితం చేయడం సమంజసం కాదన్నారు. కొందరి ప్రయోజనాల కోసం లక్షలాదిమంది ప్రజల ఆకాంక్షను పక్కన పెట్టడం ఏదో ఒక రకమైన కారణాలు చూపి రోడ్డు విస్తరణను ఆపడం ఎంతవరకు సమంజసమని అన్నారు. నియోజకవర్గ ప్రజల ఇబ్బందులను పాలకులు అధికారులు పరిగణంలోకి తీసుకుని గతంలో తీసుకువచ్చిన స్టేట్ లాంటి రోడ్డు విస్తరణ నిలుపుదలను ఎదుర్కోవాలని, ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని వారు కోరారు. పాలకులు ప్రజల కోసం పనిచేయాలని పెత్తందారుల కోసం కాదని పెత్తందార్ల ప్రయోజనాల కంటే నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలే పాలకులు అధికారులు గుర్తించాలన్నారు. పత్తికొండ రోడ్డు విస్తరణ కాకపోవడంతో పాలకులు ప్రజలు అధికారులు చూస్తూ ఉండగానే అనేక ప్రమాదాలు జరిగే ప్రజల ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది.

About Author