NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎమ్మార్పీఎస్  32 సంవత్సరాలు ఆవిర్భావదినోత్సవం

1 min read

మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన కార్యక్రమాన్ని జయప్రదంచేయండి

ఎమ్మార్పీఎస్ నాయకుల పిలుపు

న్యూస్ నేడు పత్తికొండ:  జూలై 7న ఈదుమూడి ఎమ్మార్పీఎస్ తలపెట్టిన 32 వసంతాల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి రామ్ కొండ వెంకటేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులికొండ కోరారు. శనివారం  కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణం లో కన్యకా పరమేశ్వరి కల్యాణ మండపం నందు ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి షాలెం రాజు పాల్గొన్నారు.ఈ సమావేశానికి ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు నరసింహులు మాదిగ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి షాలెం రాజు మాట్లాడుతూ, ప్రకాశం జిల్లా ఈదముడి గ్రామం లో ఏర్పడిన ఎమ్మార్పీఎస్ జూలై 7 కు 32 సంవత్సరంలో అడుగుపెడుతున్న క్రమంలో ఉద్యమాల పురిటి గడ్డ అయిన ఈ ఈదుమూడి లో జులై 7న మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి మాదిగ జాతికి సంబంధించిన ప్రముఖులు హాజరవుతారని, మాదిగ జాతికి ఆత్మగౌరవాన్ని హక్కులను నేర్పిన గ్రామంలో ఏర్పడిన ఎమ్మార్పీఎస్ జూలై 7కు 32 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా వర్గీకరణ సాధనలో అమరులైన వారిని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ప్రతి మాదిగ బిడ్డ పై ఉందని అన్నారు.

About Author