మెడికవర్ హాస్పిటల్స్లో సంక్రాంతి సంబరాలు – రంగోలీ పోటీలు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మెడికవర్ హాస్పిటల్స్, కర్నూలులో రంగోలీ పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆసుపత్రి ప్రాంగణంలో ఉత్సాహభరితంగా జరిగింది.ఈ రంగోలీ పోటీల్లో ఆసుపత్రి సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని తమ సృజనాత్మకతను ప్రదర్శించారు. సంక్రాంతి సంప్రదాయాలు, పండుగ ఆనందాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన రంగోలీలు అందరినీ ఆకట్టుకున్నాయి. పోటీల అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలు హెడ్ శ్రీ మహేశ్వర్ రెడ్డి మరియు డీఎంఎస్ అరుణ పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పండుగలు సిబ్బందిలో ఐక్యతను, ఉత్సాహాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. పని ఒత్తిడిని తగ్గిస్తూ సానుకూల వాతావరణాన్ని సృష్టించడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.

