NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జానాల గూడెం బాధితులకు అండగా ఉంటాం

1 min read

మాలలపై కేసులు పెట్టడంపై ఖండిస్తున్నాం

నందికొట్కూరు, న్యూస్​ నేడు: నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం జానాల గూడెంలో 11మంది (ఇందులో ఇద్దరు మహిళలు) మాలలపై కేసు పెట్టించి 9 మందిని రిమాండ్ కు పంపడాన్ని  ఖండిస్తున్నామని నందికొట్కూరు మాల మహానాడు తాలూకా అధ్యక్షులు డాక్టర్ వెంకటేష్ అన్నారు.జానాల గూడెంలో 15 మాల కుటుంబాలు ఉంట11మంది మాలలపై కేసు నమోదు చేసి 9మందిని రిమాండ్ కు పంపడం చాలా బాధాకరమైన సంఘటన ప్రస్తుతం జానాలగూడెంలో మాల మహిళలు భయబ్రాంతులతో భయపడుతూ ఉంటున్నారు.మాల కుటుంబాలకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామని అన్నారు. గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ అండగా ఉంటామని వారు భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సింగరాజ పల్లె సంపత్,ముసలమడుగు సుబ్బన్న,దాసు,చిమ్మే అంకన్న,లింగాపురం శేఖర్, పెరుమాళ్ళ మధు,చెరుకు నడిపెన్నా,రాజు,మహేష్ పాల్గొన్నారు.

About Author