NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆనాడు త్యాగ ఫలితమే నేడు స్వాతంత్ర్య వేడుకలు

1 min read

జెండాను ఎగురవేసిన మున్సిపాలిటీ చైర్మన్.. కమిషనర్

నందికొట్కూరు, న్యూస్​ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను మున్సిపాలిటీ కమిషనర్ జి వెంకట రామిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.సోమవారం ఉదయం మున్సిపాలిటీ కార్యాలయ ప్రాంగణంలో మున్సిపాలిటీ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆనాడు స్వాతంత్ర్య పోరాట యోధులు కష్ట ఫలితమే నేడు దేశమంతా జాతీయ జెండా ఆవిష్కరణను పండుగ లాగా ఎక్కడ చూసినా జెండా రెపరెపలాడుతుందంటే వారి ఫలితమేనని మున్సిపాలిటీ చైర్మన్ మరియు కమిషనర్ అన్నారు.అంబేద్కర్ మరియు మహాత్మా గాంధీజీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.స్వాతంత్ర సమరయోధుల సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ మేనేజర్ సుహ్రులత, కౌన్సిలర్లు చాంద్ భాష, అబ్దుల్ రవూఫ్,లాలు ప్రసాద్, కో ఆప్షన్ సభ్యులు అబ్దుల్ గఫార్,ఉస్మాన్ బేగ్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

About Author