ఉర్దూ యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తాం..
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: పీఎంజెవికె పతకం కింద ఉర్దూ యూనివర్సిటీకి నిధులు మంజూరుకు వినతి పత్రం సమర్పించారు- మాధవ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు. నగరంలోని ఉర్దూ విశ్వవిద్యాలయంను ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్ మాజీ రాష్ట్రపతి డా. ఏపిజె అబ్దుల్ కలాం యొక్క 94వ జన్మదిన వేడుకకు ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాష ప్రాతిపదికన ఏర్పాటు చేయబడినటువంటి యూనివర్సీటి అని, సెల్ఫ్ ఫండింగ్ మరియు స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ద్వారా నిధుల సమీకరణ చేసుకోనెటువంటి కోర్సులు ప్రవేశపెట్టాలి అని తెలియచేశారు.నేను ఉర్దూ యూనివర్సిటీ కి తగిన సహకారము అందించుటకు మరియు గవర్నమెంట్ కు నా తరపున తెలియచేస్తాను.. ఈయొక్క కార్యక్రమంలో యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్. షావలి ఖాన్ , ఈ సందర్భంగా రిజిస్ట్రార్ ప్రొఫెసర్. వి. లోకానాథ , ఇంచార్జి ప్రిన్సిపల్ డా. మహబూబ్ భాష మరియు అధ్యాపక బృందం విద్యార్థులు పాల్గొన్నారు.జారిచేయువారు రిజిస్ట్రార్, డా. అబ్దుల్ హాక్ ఉర్దూ యూనివర్సిటీ, కర్నూలు.

